వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతకంతకూ ఊపందుకుంటోంది. ఈ క్రమంలో శివారు ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా పరదేశి పాలెం వైపు చూస్తున్నారు. NH-16కి సమీపంలో ఉండటం వల్ల కనెక్టివిటీ బాగుంటుంది. ఇప్పటికే. విద్య, వైద్య సౌకర్యాలు అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలు, సెమీ-గేటెడ్ కమ్యూనిటీలు, 2 BHK, 3 BHK అపార్ట్మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి.
పరదేశిపాలెం సమీపంలోని మధురవాడ IT SEZ, గీతం యూనివర్సిటీ, రుషికొండ బీచ్లు ఈ ప్రాంతాన్ని హాట్ ప్రాపర్టీ చేస్తున్నాయి. స్కూళ్లు, ఆసుపత్రులు, సూపర్ మార్కెట్లు, బ్యాంకులు , షాపింగ్ సెంటర్లు సమీపంలో ఉన్నాయి. పరదేశిపాలెంలో రెసిడెన్షియల్ ప్లాట్ల ధరలు ప్లాట్ సైజు, స్థానం, గేటెడ్ కమ్యూనిటీ సౌకర్యాలు, గ్రేటర్ విశాఖ అనుమతులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.
పరదేశిపాలెంలో రెసిడెన్షియల్ ప్లాట్ల ధరలు ఇప్పటికే కాస్త ఎక్కువగా ఉంటున్నాయి. 200 చదరపు గజాల స్థలం కనీస ధర రూ. 40 లక్షల పైనే ఉంటోంది. ఇళ్ల స్థలాలు ఎక్కువగా మధ్యతరగతి వాళ్లు వాకబు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల ఆమోదం పొందినవి, ఈస్ట్ ఫేసింగ్, కార్నర్ ప్లాట్లు , గేటెడ్ కమ్యూనిటీలలో ఉన్నవి ఎక్కువ డిమాండ్లో ఉన్నాయి. బోగాపురంకు పరదేశీ పాలెం దగ్గర. బోగాపురం వరకూ రియల్ ఎస్టేట్ వెంచర్లు కనిపిస్తున్నాయి.
వచ్చే రెండేళ్లలో ధరలు బాగా పెరిగే ప్రాంతాల్లో పరదేశీ పాలెం ముందు ఉంటుందని చెబుతున్నారు. పెట్టుబడి ఆలోచనలు, విశాఖలో స్థిరపడాలనుకునేవారికి పరదేశీ పాలెం మంచి ఆప్షన్ అవుతుంది.