విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించింది. ఈ మార్గంలోని కీలక పట్టణం ఉయ్యూరు రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా మారింది. మచిలీపట్నం పోర్టు పనులు 2026 చివరి నాటికి పూర్తికావాలని లక్ష్యంగా పెట్టుకోవడం, దానికి తోడు అమరావతి రాజధాని కనెక్టివిటీ పెరగనుండటంతో ఇన్వెస్టర్లు ఉయ్యూరు పరిసర ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు.
కేవలం రవాణా సౌకర్యమే కాకుండా, పోర్టు ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్ హబ్‌లు ఇక్కడ ఏర్పాటు కాబోతుండటం భూముల ధరలకు రెక్కలు తెచ్చింది. ప్రస్తుతం ఈ హైవే విస్తరణకు సంబంధించి భూసేకరణ , డీపీఆర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. గతంలోనే నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారి, ఇప్పుడు ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా మారనుండటంతో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఉయ్యూరు పట్టణం విజయవాడకు దగ్గరగా ఉండటం, ఇక్కడ ఇప్పటికే విద్యా సంస్థలు , వాణిజ్య వ్యాపారాలు స్థిరపడి ఉండటం వల్ల, కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు గేటెడ్ కమ్యూనిటీలు , కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల గత కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకుంది.
ముఖ్యంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఉయ్యూరు మీదుగా వెళ్లే అవకాశం ఉండటం ఈ ప్రాంతానికి అతిపెద్ద అడ్వాంటేజ్‌గా మారింది. ఇది మచిలీపట్నం పోర్టును నేరుగా రాజధానితో అనుసంధానం చేయడమే కాకుండా, పారిశ్రామికంగా ఉయ్యూరు రూపురేఖలను మార్చేయబోతోంది. హైవే వెంబడి ఉన్న పొలాలు వెంచర్లుగా మారుతుండటంతో, గడిచిన ఏడాది కాలంలోనే ఎకరం ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు స్థానిక రియల్టర్లు పేర్కొంటున్నారు. కేవలం పెట్టుబడి కోణంలోనే కాకుండా, నివాస యోగ్యంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది.
