150వ సినిమాకి మార్చిలో క్లారిటీ వస్తుందంటున్న వినాయక్‌!

ఈమధ్యకాలంలో ఏ చిత్రానికీ రానంత క్రేజ్‌ చిరంజీవి 150వ సినిమాకి వచ్చింది. అది చిరంజీవి మీద వున్న అభిమానం కావచ్చు, మరేదైనా కావచ్చు. ఈ సినిమాని మీడియా తన భుజాలమీద వేసుకొని విపరీతమైన పబ్లిసిటీ చేసిన విషయం తెలిసిందే. దాదాపు చిరంజీవి 150వ సినిమా గురించి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో డిస్కషన్‌ ఎండింగ్‌ స్టేజ్‌లో వుండగా డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ మళ్లీ ఈ సినిమా గురించి పబ్లిక్‌గా మాట్లాడడంతో చిరంజీవి మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. చిరంజీవితో వినాయక్‌ సినిమా కన్‌ఫర్మ్‌ అయిందన్న వార్తలు గతంలో వచ్చినా దానికి సంబంధించి ఎలాంటి ప్రోగ్రెస్‌ తెలియలేదు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కథ విషయం మార్చిలో ఫైనల్‌ అవుతుందని చెప్తున్నాడు వినాయక్‌. మార్చిలో స్టోరీ సిట్టింగ్స్‌ జరుగుతాయని, అప్పుడే కథ విషయంలో ఒక క్లారిటీ వస్తుందని వినాయక్‌ అంటున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఒక పబ్లిక్‌ ఫంక్షన్‌లో ఈ విషయాలను వెల్లడించాడు వినాయక్‌. దీంతో మళ్ళీ మెగా అభిమానుల్లో చిరంజీవి 150వ సినిమాపై ఆసక్తి రేకెత్తుతోంది. ఇప్పటివరకుఈ సినిమాకి సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో, ఎంత వర్కవుట్‌ మెటీరియలైజ్‌ చేస్తారో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com