త్రివిక్రంతో పోటీ పడుతున్న ప్రకాశ్ రాజ్..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం అంటే తెలుగు సినిమాల్లోనే కాదు సౌత్ సిని అభిమానుల్లో కూడా ఓ సెపరేట్ క్రేజ్ ఉంది. అదేవిధంగా తన విలక్షణ నటనతో సౌత్ ప్రేక్షకులను తన మాయలో పడేసుకున్నాడు ప్రకాశ్ రాజ్. పాత్ర ఏదైనా తను చేస్తే నిజంగా ఒకవేళ ఆ పాత్ర గల వ్యక్తి ఇలానే ఉంటాడేమో అనేంత పర్ఫెక్షన్ ప్రకాశ్ రాజ్ దగ్గర ఉంటుంది. అందుకే గుప్పెడంత మనసు సీరియల్ తో వచ్చిన ఆయన ఇప్పుడు విలక్షణ నటుడిగా పేరు ప్రఖ్యాతలను సంపాధించాడు.

అయితే అప్పుడప్పుడు తనలోని దర్శకత్వ ప్రతిభను కూడా బయటపెడతాడు ప్రకాశ్ రాజ్. తన దర్శకత్వంలో ఇదవరకు వచ్చిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ‘మన ఊరి రామాయణం’ అంటూ ఓ గ్రామీణ నేపథ్య కథతో సినిమా తీస్తున్నాడు ప్రకాశ్ రాజ్. తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమాను సరిగ్గా త్రివిక్రం ప్రస్తుతం తీస్తున్న అ..ఆ సినిమా విడుదల రోజునే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఫిబ్రవరి 14న విడుదలవుతుండటం విశేషం.

త్రివిక్రం సినిమాల్లో తెలుగుదనం ఉట్టి పడుతుంది. ఇక ఆయన రాసే మాటలకైతే ప్రేక్షకులు ఫిదా అయిపోతారు మరి అలాంటి త్రివిక్రం సినిమాకు పోటీగా ప్రకాశ్ రాజ్ మన ఊరి రామాయణం నిలవగలుగుతుందా అంటే.. కష్టమే అంటున్నారు. నితిన్, సమంత జంతగా త్రివిక్రం చేస్తున్న అ..ఆ సినిమాలో మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కూడా ఓ ప్రత్యేక పాత్ర చేస్తుంది. మరి త్రివిక్రం వర్సెస్ ప్రకాశ్ రాజ్ లలో ఎవరు నెగ్గుతారో సినిమాల ఫలితాలను బట్టే తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com