తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హవా అయినా అంతే. కొంతకాలం పాటు ధృవ నక్షత్రంలా వెలిగిపోతుంది. ఆడిందే ఆట…పాడిందే పాట అన్నట్టుంటుంది వ్యవహారం. ఎంత రెమ్యూనరేషన్ అడిగినా ఇవ్వడానికి అందరూ రెడీగా ఉంటారు. ఎన్ని కండిషన్స్ పెట్టినా ఒకె అనేస్తూ ఉంటారు. కానీ ఏ స్టార్ అయినా సరే అలాంటి టైంలోనే ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా యాటిట్యూడ్ చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం…. పరిస్థితులు తల్లకిందులైనప్పుడు.. అందరూ కూడా ఆ స్టార్‌ని దూరం పెట్టేసే ప్రమాదం పొంచి ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ ఇప్పటి వరకూ కూడా ఈ రెండు రకాల అనుభవాలు మన తెలుగు సినిమా వాళ్ళకు….అది కూడా సూపర్ టాలెంటెడ్ పీపుల్‌కి చాలా మందికి అనుభవమే.
దేవి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దేవిశ్రీ ప్రసాద్…ఆ తర్వాత వర్షం, ఆర్య, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి సినిమాలతో సూపర్ స్టార్ ఢం తెచ్చుకున్నాడు. గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది లాంటి సినిమాలతో పీక్స్‌కి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత నుంచి దేవిశ్రీ ప్రసాద్లో చాలా మార్పులు వచ్చాయి. రెమ్యూనరేషన్ చుక్కల్లోకి వెళ్ళిపోయింది. అలాగే డైరెక్టర్స్‌కి, ప్రొడ్యూసర్స్‌కి తను పెట్టే కండిషన్స్ కూడా కాసింత కష్టంగా అనిపించడం స్టార్ట్ అయింది. లెజెండ్ సినిమా ప్రెస్ మీట్లో బోయపాటి శ్రీను తప్పుగా మాట్లాడాడు. కానీ దేవీశ్రీప్రసాద్ రియాక్ట్ అయిన విధానం కూడా చాలా మందికి నచ్చలేదు. అలాగే నాన్నకు ప్రేమతో సినిమా టైటిల్ సాంగ్ లిరిక్స్ విషయంలో దేవిశ్రీకి ఫుల్ ప్రీడం ఇచ్చారు ఎన్టీఆర్, సుకుమార్‌లు. అందుకే ఆ టైటిల్ సాంగ్‌లో ఉండే కొన్ని పదాలు దేవిశ్రీ ప్రసాద్ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి ఉంటాయి. అయితే అదే ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసే విషయంలో మాత్రం కాస్త ఎక్కువ టైం తీసుకున్నాడు దేవి. జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవడానికి అది కూడా ఒక రీజన్. అయినప్పటికీ కొరటాల శివ మాత్రం దేవిశ్రీ ప్రసాద్‌నే తన తర్వాత సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు.
అయితే దేవిశ్రీ ప్రసాద్ లేకపోయినప్పటికీ ‘అ..ఆ’ సినిమాకు సూపర్బ్ మ్యూజిక్ కంపోజ్ చేయించుకోవడంలో సక్సెస్ అయిన త్రివిక్రమ్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్‌కి హ్యాండ్ ఇచ్చాడు. అలాగే సర్దార్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవి వర్క్‌తో పవన్ డిసప్పాయింట్ అయ్యాడు. అందుకే ఆ సినిమా ప్రమోషన్స్ టైంలో దేవి గురించి చాలా తక్కువ మాట్లాడేశాడు పవన్. పవన్ కళ్యాణ్ విషయం పక్కన పెట్టినా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ సినిమాలను మిస్ చేసుకోవడం దేవి కెరీర్‌కి పెద్ద దెబ్బే. అలాగే గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక నేపథ్యమున్న సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అర్థాంతరంగా హ్యాండ్ ఇచ్చేయడం కూడా విమర్శలకు దారితీసింది. దేవిశ్రీ మ్యూజిక్‌లో రిపిటీషన్ కూడా పెరుగుతోందని, అలాగే క్వాలిటీ తగ్గిపోతుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడంతో పాటు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్‌కి ఎన్నో కండిషన్స్ పెట్టే దేవిశ్రీ ప్రసాద్ నుంచి వర్క్ కూడా అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తోంది ఇండస్ట్రీ. ఆ విషయంలో తేడాలు వచ్చినా…ఇప్పుడు పవన్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న అనిరుథ్‌తో సహా వేరే ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ సక్సెస్‌లు కొట్టినా దేవిశ్రీ ప్రసాద్‌కి కష్టకాలం మొదలైనట్టే. ఇక నుంచి అయినా చేసిన తప్పులు సరిదిద్దుకుని…ముందు ముందు చేయబోయే సినిమాలకు ఈ రాక్ స్టార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో….ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తాడో చూడాలి మరి.