జగన్ లేఖను ఖండిస్తే .. అంతు చూసేస్తారా..!?

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీకి చెందిన సానుభూతిపరులు, కార్యకర్తల అత్యుత్సాహం … వైసీపీకే చేటు తెస్తోంది. వ్యతిరేకించిన ప్రతీ ఒక్కర్ని బెదిరించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ వైఖరికి అనుగుణంగానే వైసీపీ కార్యకర్తలు కూడా చెలరేగిపోతున్నారు. న్యాయమూర్తులపై ఫిర్యాదులు చేస్తూ.. జగన్ చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసి.. దాన్ని మీడియాకు విడుదల చేయడంపై దుమారం రేగుతోంది. దాదాపుగా దేశంలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లు జగన్ తీరును ఖండించాయి. అయితే.. ఈ బార్ అసోసియేషన్లకు బెదిరింపు కాల్స్ వెళ్లడం ప్రారంభించాయి. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్‌ మూడు రోజుల కిందట.. జగన్ తీరును ఖండించింది.

ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేఖ విడుదల చేసింది. ఆ లేఖలో ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కు చెందిన వారి ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్లకు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్ ద యునైటెడ్ కింగ్‌డమ్‌ సభ్యుల పేరుతో ఫోన్లు చేసి బూతులు తిట్టడం ప్రారంభించారు. యాక్సిడెంట్లు అవుతాయని.. కుటుంబసభ్యులు ఉన్నారు గుర్తుంచుకోవాలని.. ఇలా రకరకాలుగా బెదిరించడం ప్రారంబించారు. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్‌ కార్యదర్శి, ప్రెసిడెంట్‌ ఇద్దరికీ ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.

దీంతో వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి..పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికి బెదిరింపు కాల్స్ వచ్చిన ఫోన్ నెంబర్‌ కడప జిల్లా రాజంపేట ఎస్టీడీ కోడ్‌తో ఉందని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. అత్యుత్సాహంతో జగన్‌పై అభిమానంతో ఇలాంటి పనులు చేస్తున్న వారు ఆయనకు మరింత చేటు చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ప్రభుత్వం కూడా మొదటి నుంచి.. తమను ప్రశ్నించిన వారిపై ఇలాగే వ్యవహరిస్తూండంతో.. సానుభూతిపరులు కూడా అదే చేస్తున్నారు. అది ఇప్పుడు తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close