జిల్లాల మధ్యనే నీటియుద్ధాలు షురూ!

వారేమీ భారత్‌- పాకిస్తాన్‌ లకు చెందిన, దేశ సరిహద్దులకు ఇరువైపులా మోహరించిన వైరిపక్షాల యుద్ధ సైనికులు కాదు. కనీసం దేశంలోని రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసు పటాలాలు కూడా కాదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే రెండు జిల్లాలకు చెందిన పోలీసులు. కానీ ప్రాజెక్టుకు అటు ఒక జిల్లా పోలీసులు, ఇటువైపు ఒక జిల్లా పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్న స్థానిక రైతులు, నాయకులతో కలిసి మోహరించడంతో యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది.

అవును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రెండు జిల్లాల మధ్యనే నీటి కోసం దాదాపు యుద్ధ వాతావరణం ఏర్పడుతున్న దారుణమైన పరిస్థితి ఇది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం 85వ మైలురాయి వద్ద సోమవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడినుంచి సాగర్‌ కెనాల్‌ లాకులు ఎత్తేయడం ద్వారా గుంటూరు జిల్లాకు నీళ్లు మళ్లించుకోవడానికి ఆ జిల్లాకు చెందిన రైతులు, నాయకులు అక్కడకు చేరుకున్నారు. అదే జరిగితే గనుక.. తమ జిల్లాకు దుర్భిక్షం తప్పదని, చుక్క నీరు రాదని అంటూ ఒంగోలు వాసులు ఆందోళన ప్రారంభించారు.

గంటల వ్యవధిలో సాగర్‌ కెనాల్‌ కు అటూ ఇటూ ఇరు వర్గాల మోహరింపుతో యుద్ధవాతావరణం ఏర్పడిపోయింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, నీటి పారుదల మంత్రి దేవినేని ఉమాతో సమస్యగురించి మాట్లాడగా, విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానంటూ ఆయన తప్పించుకున్నారు.

నిజానికి రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటికోసం యుద్ధాలు జరిగే పరిస్థితి వస్తుందని అప్పట్లో కొందరు నాయకులు జోస్యం చెప్పారు. ఈ రెండు రాష్ట్రాలు కాదు కదా, ఏపీలోని రెండు జిల్లాల మధ్యనే యుద్ధం జరిగే దారుణమైన పరిస్థితి ఇప్పుడు తలెత్తుతోంది. నీటి పారుదల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కొరతను తీర్చడానికి చాలా ప్రణాళికలు వేస్తున్న చంద్రబాబు.. జిల్లాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే ఈ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మంచోడంటున్న నాగబాబు..!

విక్రమార్కుడు సినిమాలో  ఓ సీన్ ఉంటుంది. ఓ పోలీస్ అధికారి భార్యను ఆ ఊరిలో అధికారం చెలాయించే పెద్ద మనిషి కొడుకు ఎత్తుకొచ్చి శారీరక కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు.  తన భార్య అక్కడే...

ఇక బీజేపీకి పవన్ ప్రచారం లేనట్టే..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత ప్రచారానికి వస్తారని ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ నేతలకు క్వారంటైన్ షాక్ తగిలింది. తన వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా సోకినట్లుగా తేలడంతో...

ఆ వీడియో చూపించారని దేవినేని ఉమపై కేసు..!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలపై కేసులు పెట్టడం సహజమే. ముఖ్యంగా సీఐడీ పోలీసులు ఆ విషయంలో చాలా ముందు ఉంటారు. ఎవరో చెబుతున్నట్లుగా చిత్ర విచిత్రమైన కేసులు పెడుతూ ఉంటారు. తాజాగా మాజీ మంత్రి...

జగన్ నిర్ణయాలను తానే తీసుకుంటున్న పెద్దిరెడ్డి..!

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో జగన్ తర్వాత తానే పవర్ ఫుల్ అని చెప్పాలనుకుంటున్నారో.. జగన్ కన్నా తానే పవర్ ఫుల్ అని చెప్పాలనుకుంటున్నారో కానీ... అప్పుడప్పుడూ... కాస్త తేడా ప్రకటనలు చేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close