సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి, విదేశీ మద్యం పట్టుబడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ బర్త్డే పార్టీ జరిగింది. ఈ పార్టీపై పోలీసులు రెయిన్ చేశారు. దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుడ్డాడు. ఇలాంటి పార్టీల్లో మద్యం వినియోగించుకడానికి ముఖ్యంగా విదేశీ మద్యం వినియోగించడానికి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు.
అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించడంతో మంగ్లీ పై కేసు నమోదు చేశారు. విదేశీ మద్యం అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం పైనా మరో కేసు నమోదు. త్రిపురా రిసార్ట్ జిఎం శివరామకృష్ణ పై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నరాు. అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డిజే సీజ్ చేశారు. ఈ బర్త్ డే పార్టీలో దివి, కాసర్ల శ్యామ్, రచ్చ రవి వంటి వారు పాల్గొన్నారు.
చోటా, మోటా సెలబ్రిటీలు అందరూ పుట్టిన రోజు వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వేడుకల్లో డ్రగ్స్, విదేశీ మద్యం సరఫరా చేయడం కామన్ గా మారుతోంది. పోలీసులు రెయిడ్ చేసినప్పుడు దొరుకుతున్నారు. మళ్లీ కామన్ గా మారిపోతున్నాయి.