పోలీసులకిచ్చిన “ఆఫర్” కూడా జగన్‌ మార్క్‌దే !

సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన సీఎం జగ‌న్ అని దేశవ్యాప్తంగా గొప్పగా ప్రకటించారు. డీజీపీ గౌతం సవాంగ్ కూడా.. జగన్ ఎంత గొప్పవాడోనని అందుకే వీక్లీ ఆఫ్ ఇచ్చారని చాలా సార్లు చెప్పారు. తీరా చూస్తే పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు కావడం లేదు. ఆ విషయాన్ని పోలీసుల అమర వీరుల దినోత్సవం రోజున సీఎం జగనే చెప్పారు. కరోనా కారణంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేయలేకపోయామని.. ఇప్పటి నుండి అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

పోనీలే చెప్పిన రెండున్నరేళ్లకయినా అమలవుతోంది కదా అని పోలీసులు సంతృప్తి పడ్డారు. కానీ అదంతా ఉత్తదే. ఇప్పటికీ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు కావడం లేదు. ఈ విషయాన్ని హోంమంత్రి సుచరితనే నేరుగా చెప్పారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పోలీసులకు వీక్లీ ఆఫ్‌ను త్వరలోనే అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలంటే తగినంత సిబ్బంది ఉండాలి. ఇటీవలి కాలంలో ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో సమస్య జఠిలం అయింది. ఈ కారణంగా వీక్లీ ఆఫ్ అసాధ్యమని.. పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే సీఎం జగన్ చెప్పారు కాబట్టి.. ప్రభుత్వానికి ఆ పేరుతో పబ్లిసిటీ చేసుకుంటూంటే మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు.

మాకు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వలేదు కదా అని పోలీసులు ఎదురు తిరిగే పరిస్థితి లేదు. ఇవ్వకపోయినా పర్వాలేదు.. టీడీపీ నేతలపై మాత్రం రోడ్లపై పరుగెత్తించి కొడతాం అని మహిళా పోలీసులతో స్టేట్‌మెంట్‌లు మాత్రం ఇప్పిస్తూంటారు. ఇలాంటివి చూసినప్పుడే ఏపీ ప్రజలు కూడా పాపం పోలీసులు అనుకోకుండా ఉండలేరు. కానీ ఒక్క సారి వంగడం ప్రారంభమయిన తర్వాత పతనం చివరి దాకా సాగుతుంది. అప్పుడు ప్రజలు కూడా సానుభూతి చూపించరు. ఆ పరిస్థితి ఏపీ పోలీసులకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close