కన్సల్టెంటు ఏం సాధిస్తారు కాంగ్రెస్‌ వారూ!

వెనకటికి ఎవరో వెర్రి ముదిరి రోకలి తలకు చుట్టమన్నాట్ట! ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆలోచన ధోరణి కూడా అలాగే ఉన్నట్లుంది. కన్సల్టెంట్లు కార్పొరేట్‌ తరహా రాజకీయ విధానాలు పోకడల విషయంలో ఒకసారి చేసిన ప్రయోగంతో తల బొప్పి కట్టినా సరే వారింకా పాఠాలు నేర్చుకున్నట్లుగా లేదు. మళ్లీ పార్టీని ఉద్ధరించడం కోసం కొత్త కొత్త ప్రయోగాలకు తెగబడుతున్నారు. కన్సల్టెంటును నియమించేసి వారి తెలివితేటల ప్రకారం ప్రజల్లోకి వెళితే.. అక్కడితే పార్టీకి అపూర్వమైన వైభవం దక్కుతుందని వారు అనుకుంటున్నారు. ఫలితాల సంగతి దేవుడెరుగు ప్రస్తుతానికి ఈ ప్రయోగం మాత్రం తెలంగాణ కాంగ్రెస్‌ మీద జరుగుతోంది.
తెలంగాణలో ఇలా రాష్ట్రం ఏర్పాటుచేసిన వెంటనే.. అలా తమ పార్టీని జనం నెత్తిన పెట్టేసుకుంటారని కలలు కన్నటువంటి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నది. ఆ తర్వాత అయినా కేసీఆర్‌ సర్కారు మీద తమ పార్టీ నాయకులు గట్టిగా పోరాటం సాగించి.. పార్టీని నిలబెడతారని అనుకుంటే.. రోజురోజుకూ పార్టీ పతనం అయిపోతున్నదే తప్ప.. ఒక్క అంగుళం కూడా పైకి ఎదుగుతున్న వాతావరణమే లేదు. ఆ నేపథ్యంలో ఇక ఈ నాయకులను నమ్ముకుంటే మరింత పతనమే తప్ప మార్పు ఉండదని కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఫిక్సయినట్లుంది. అందుకు వారు ప్రశాంత్‌ కిషోర్‌ అనే కన్సల్టెంటును తాజాగా నియమించుకున్నారు.
ఈ ప్రశాంత్‌ కిషోర్‌ గతంలో మోడీకి , భాజపాకు అనుకూలంగా పనిచేశారుట. ఎన్నికల వ్యూహరచనలో చాలా ఉద్ధండుడు అనే ఉద్దేశంతో పార్టీకి కన్సల్టెంట్‌గా తీసుకున్నారుట. ఆయనకు ప్రస్తుతం తెలంగాణ పార్టీని ఉద్దరించే బాధ్యత అప్పగించారుట. అయితే కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఇలాంటి ప్రయోగాలే చేసింది. అద్భుతమైన యాడ్‌ ఏజన్సీ అనే ఉద్దేశంతో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జపాన్‌ కు చెందిన ఒక యాడ్‌ కంపెనీకి దాదాపు 300 కోట్ల రూపాయల పైచిలుకు ప్రకటనల బాధ్యత అప్పగించింది. వారి ‘స్టయిల్లో’ వారు రూపొందించిన ప్రకటనలు జనానికి రుచించలేదు. పార్టీ బొక్కబోర్లా పడింది. అలాంటి కార్పొరేట్‌ వైద్యం దేశీయ రాజకీయానికి పనిచేయదని ఒకసారి గుణపాఠం ఎదురైనా కూడా.. మళ్లీ కాంగ్రెస్‌ అదే పనిచేస్తున్నది. మరి ప్రశాంత్‌ కిషోర్‌తో తెలంగాణ కాంగ్రెస్‌కు చేయించే చికిత్స ఎలాంటి ఫలితాలు ఇస్తుందో!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close