అవార్డు ఇచ్చి చిరంజీవిని కలిపేసుకుంటున్న బీజేపీ !

భారత రత్న అవార్డులను కూడా బీజేపీ రాజకీయ లాభం లెక్కలు చూసుకునే ఇస్తుందనే విమర్శలు ఉన్నాయి. అలాంటిది ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ లాంటి ప్రతీ ఏడాది ఇచ్చే అవార్డును చిరంజీవికి ఇచ్చారంటే అలాంటి లెక్క లేకుండా ఏమీ ఉండదు. నిజంగా చిరంజీవి అంత కంటే ఎక్కువ ప్రతిభావంతుడు. ఆయనకు పద్మవిభూషణ్ కూడా వచ్చింది. దాంతో పోలిస్తే ఈ ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ పురస్కారం పెద్దదేం కాదు. అయితే వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ అందరూ సంతోషించారు. కానీ ఆ తర్వాత బీజేపీ నేతలు చేస్తున్న హడావుడి మాత్రం ఏదో తేడాగా ఉన్నట్లుగా ఉందే అన్న అభిప్రాయానికి వస్తున్నారు.

చిరంజీవికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ అవార్డు అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అభినందలు తెలిపారు. అక్కడ్నుంచి ఇతర బీజేపీ నేతలు ప్రారంభించారు. చివరికి ఏపీ బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కూడా అభినందనలు తెలిపారు. ఇక సునీల్ ధియోధర్ లాంటి వాళ్లు ఊరుకుంటారా ? వారు కూడా రంగంలోకి దిగారు. కింది స్థాయి బీజేపీ నేతల గురించి చెప్పాల్సిన పని లేదు. వారి హడావుడి చూస్తూంటే.. చిరంజీవి బీజేపీ నేత అయిపోయారా.. లేకపోతే బలవంతంగా కలిపేసుకుంటున్నారా అన్న డౌట్ ఇతరులకు రావడం ఖాయమే.

చిరంజీవిని బీజేపీ ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా చూసేందుకు ప్రయత్నిస్తోంది. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో మోదీ .. చిరంజీవి తనకు ఎంతో ఆప్తమిత్రుడన్నట్లుగా సంభాషించారు. తర్వాత కూడా ఈ పాజిటివ్ ఫీలింగ్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు అది ఇంకాస్త ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారో రారో కానీ.. బీజేపీ మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఎవరికైనా అనిపిస్తే.. తప్పేం లేదు.. ఎందుకంటే బీజేపీ నేతల ప్రయత్నం అదే మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close