ఆ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఆకాశం నుండి ఊడిపడ్డారా..?

కరోనా కాలంలోనూ పూలబాటలో నడిచే ప్రజాప్రతినిధులు ఉంటారా..? రూ. ఐదు రూపాయల సాయం చేసి దాన్ని రూ. ఐదు లక్షలు పెట్టి ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకునే వారు ఉంటారా..?. ఛీ.. ఛీ అలా ఎవరూ చేయరండి.. ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసేది ప్రజలే కదా.. వారికి కష్టం వచ్చినప్పుడు ఇలా ఎలా చేస్తారు.. అని మనలో చాలా మందికి అనిపిస్తుంది. నిజమే .. దేశంలో ఎక్కడా.. ఎవరూ అలాంటి పనులు చేయరు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే.. ఇలాంటి చిత్రవిచిత్రాలు అన్నీ ఏపీలో జరుగుతూంటాయి.

నగరి ఎమ్మెల్యే రోజా కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి ఫోకస్‌లో ఉన్నారు. ఆమె నగరిలో అప్పుడప్పుడూ… వైరస్ నిరోధక ద్రావణాన్ని పీపీఈ కిట్లు వేసుకుని మరీ చల్లుతున్నారు. అక్కడక్కడా అన్నదానం ప్రోగ్రాంలు పెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి రూపాయల పంపిణీని దగ్గరుండి చూసుకున్నారు. కొన్ని అనుకూలమైన మీడియాల్లో.. ప్రజల్లోనే ఉంటున్నానని… కరోనాకు భయపడలేదని… ఇంటర్యూలు ఇచ్చారు. అంత వరకూ బాగానే ఉన్నా.. తాజాగా ఆమె ఓ గ్రామానికి వెళ్లారు. మామూలుగా వెళ్లలేదు… అంటే ఎన్ 95 మాస్కులు.. చేతులకు గ్లౌజులు వేసుకుని వెళ్లడం కాదు.. రెడ్ కార్పెట్ పరిపించుకుని.. తాను నడుస్తూండగా.. గ్రామస్తులంతా.. లైన్లలో నిల్చుని ఆమె పాదాలపై పూలు చల్లుతూండగా… అలా రాజసంగా నడుచుకుంటూ వచ్చారు. దాన్ని పరోక్షంగా అయినా సోషల్ మీడియాలో వైరల్ చేసుకుని ఆనందపడిపోయారు. కరోనా దెబ్బకు గ్రామీణ ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. వారికి నిత్యావసర సరుకులు అందించాల్సిన పరిస్థితి. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని రోజా.. ఇలా పాదపూజలు చేయించుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మరో మహిళా ఎమ్మెల్యే విడదల రజనీ హడావుడి కూడా దీనికే మాత్రం తగ్గట్లేదు. సోషల్ మీడియా టీంను నియమించుకున్న ఆమె..వారికి జీతాలు కోసం కొన్ని లక్షలు వెచ్చిస్తున్నారు. రోజువారీగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో.. ఎలా ప్రచారం చేయాలో వారు డిజైన్ చేస్తున్నారు. దాని ప్రకారం.. రోజులో… ఒకటి రెండు చోట్లకు వెళ్తారు. ఆమె పర్యటనను నాలుగైదు కెమెరాల్లో చిత్రీకరిస్తారు పబ్లిస్టిటీ సిబ్బంది. అంత కష్టపడి ఎక్కువ మంది చూడకపోతే ఎలా అనుకున్నారేమో.. సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ విభాగం కింద డబ్బులు ఖర్చు పెట్టి మరీ వైరల్ చేసుకుంటున్నారు. ఒక్క నెలలో ఆమె సోషల్ మీడియా బడ్జెట్ ఎనిమది లక్షలు దాటిపోయిదన్న లెక్కలు వచ్చాయి. పేదలకు ఆమె చేసిన సాయం అంత లేదు.

ఇలాంటి నేతలు… నిస్సహాయాలైన ప్రజలకు ఒక్క పూట కడుపు నింపి.. తాము దానకర్ణులమని.. శివగాములం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చుకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. పబ్లిసిటీ కోసమే.. సాయం చేస్తున్నట్లుగా వీరి తీరు ఉంది. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి ఉండదు.. ఒక్క ఏపీలోనే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బాస్ నుండి దేవి నిష్క్రమణ, టీవీ9 పై జనాల్లో వ్యతిరేకత కూడా కారణమా ?

బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు టిఆర్పీ లతో దూసుకెళుతోంది. కంటెస్టెంట్స్ జాబితా బాగోలేదు అన్న కారణంగా రెండు మూడు రోజుల తర్వాత పడిపోయిన రేటింగులు 10వ రోజు నుండి భారీగా పుంజుకున్నాయి....

పవన్ కళ్యాణ్ ఈనాడు ఇంటర్వ్యూ పై సాక్షి కొమ్మినేని ఏడుపు, ఈనాడు కి నీతులు

ఇటీవల పవన్ కళ్యాణ్ ఈనాడు పత్రికకు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అమరావతి, జగన్ పాలన, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను ఆ...

గ్రేటర్ సమస్యలపై కేటీఆర్‌ని టార్గెట్ చేస్తున్న రేవంత్..!

తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల రాజకీయం రాజుకుంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అంచనా వేయడం కష్టం కానీ.. రాజకీయ నేతలు మాత్రం.. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. గ్రేటర్ పరిధిలో...

ఠాగూర్ అయినా టీ కాంగ్రెస్‌లో అందర్నీ కలపి ఉంచగలరా..!?

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా కుంతియా స్థానంలో మాణిగం ఠాగూర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఆయన తెలంగాణలో అడుగు పెట్టి..ఓ సారి సమావేశం కూడా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు.. అందరూ ఆయన ఎదుట...

HOT NEWS

[X] Close
[X] Close