హ‌ను రాఘ‌వ‌పూడి.. నెక్ట్ ఏంటి?

‘సీతారామం’తో… ఓ సూప‌ర్ స‌క్సెస్ కొట్టాడు హ‌ను రాఘ‌వ‌పూడి. ఈ విజువ‌ల్ బ్యూటీకి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇది వ‌ర‌కు కూడా హ‌నుకి హిట్లు ఉన్నాయి. కానీ… ఇంత గౌర‌వం ఎప్పుడూ రాలేదు. హ‌ను రాత‌, తీత‌..ని ప్ర‌తి ఒక్క‌రూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు హ‌ను త‌ర‌వాత ఎలాంటి సినిమా తీస్తాడు? అనే ఉత్కంఠ‌త ంద‌రిలోనూ నెల‌కొంది. మైత్రీ మూవీస్ లో హ‌ను ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ‘సీతారామం’ త‌రవాత హ‌ను చేయ‌బోయే ప్రాజెక్టు మైత్రీ లోనే. క‌థ రెడీ అయిపోయింది. హీరో దొర‌క‌డ‌మే త‌రువాయి.

అయితే ఈసారి హ‌ను జోన‌ర్ మార్చాడు.త‌న‌కు అచ్చొచ్చిన ల‌వ్ స్టోరీని కాకుండా హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ చేయ‌బోతున్నాడు. క‌థ పిరియాడిక్ జోన‌ర్లో సాగ‌బోతోంది. సెట్స్‌కి, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ ఈసారి చాలా ప్రాధాన్యం ఉంద‌ని తెలుస్తోంది. అయితే ఈ క‌థ‌లోనూ త‌న మార్క్ ల‌వ్ ట్రాక్ ఉండాల‌ని చూస్తున్నాడు హ‌ను. అది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే హ‌ను సినిమా అనేస‌రికి ల‌వ్ ట్రాకులు బాగుంటాయ‌ని పేరొచ్చేసింది. ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’ ఫ్లాప్ అయినా స‌రే, అందులో ల‌వ్ ట్రాక్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అందుకే.. ఈసారి కూడా ల‌వ్ ట్రాక్ పై ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ పెట్టాడ‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గాడ్ ఫాద‌ర్‌’ హిట్‌… నాగ్ హ్యాపీ!

ఈ ద‌స‌రాకి మూడు సినిమాలొచ్చాయి. గాడ్‌ఫాద‌ర్‌, ది ఘోస్ట్‌, స్వాతిముత్యం. గాడ్ ఫాద‌ర్‌కి వ‌సూళ్లు బాగున్నాయి. స్వాతి ముత్యంకి రివ్యూలు బాగా వ‌చ్చాయి. ది ఘోస్ట్ కి ఇవి రెండూ లేవు....

వైసీపీ సర్పంచ్‌ల బాధ జగన్‌కూ పట్టడం లేదు !

వారు వైసీపీ తరపున సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పార్టీనో.. సొంత పార్టీలో ప్రత్యర్థుల్నో దెబ్బకొట్టడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు. గెలిచారు. కానీ ఇప్పుడు వారికి అసలు సినిమా కనిపిస్తోంది. వీధిలైట్...

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు..

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు.. ఇప్పుడు బంతి... వాళ్లిద్ద‌రి చేతికీ చిక్కింది. ఇక ఆడుకోవ‌డ‌మే త‌రువాయి. అవును... అల‌య్ బ‌ల‌య్‌... కార్య‌క్ర‌మంలో చిరంజీవి - గ‌రిక‌పాటి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలిసింది. చిరుని...

రైతుల పాదయాత్రకు పోటీగా నిరసన యాత్రలట !

నమ్మించి మోసం చేశారని అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూంటే వారికి పోటీగా నిరసన యాత్రలు చేయడానికి వైసీపీ ప్రణాళికలు వేస్తోంది. మేధావులతో సమావేశాలు వర్కవుట్ కాకపోవడంతో ఏదో ఒకటి చేయాలన్న తలంపుతో వారి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close