తెలంగాణలో పెరుగుతున్న ఐటీ దాడులు – రాజకీయం ఉందా ?

తెలంగాణలో ఐటీ అధికారుల కదలికలు ప్రారంభమయ్యాయి. వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతలో పలు కంపెనీలపై ఇలా సోదాలు జరిగాయి. ఇప్పుడు మరో బడా కంపెనీ వాసవి గ్రూప్‌పై ఎటాక్స్ చేశారు. పదుల సంఖ్యలో బృందాలతో ఒక్క సారిగా విరుచుపడిన ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఇరవై కంపెనీల పేర్లతో వాసవి గ్రూప్ వ్యాపారాలు చేస్తోంది. అనేక ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసింది.

వీరి లావాదేవీలు వేల కోట్లలోనే ఉంటాయి. అయితే దానికి తగ్గట్లుగా పన్నులు చెల్లించడం లేదని.. అందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. కానీ బడా రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే.. ఎన్నో లింకులు ఉండాలి. ముఖ్యంగా రాజకీయ నేతల లింకులు లేకుండా అది రియల్ ఎస్టేట్ కంపెనీ కాలేదు. ఎందుకంటే బ్లాక్ మనీ అంతా పోగుపడేది రియల్ ఎస్టేట్‌లోనే. అలా సంపాదించుకునేది రాజకీయ నేతలే. వారి సొమ్మే వివిధ రూపాల్లో రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి పంపుతూ ఉంటారు. అయితే ఇదెక్కడా రికార్డుల పరంగా ఉండదు. పలుమార్లు ఆ నేత బినామీ ఆస్తులు.. ఫలానా కంపెనీల్లో ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు.

దర్యాప్తు సంస్థలు చేతుల్లో ఉన్న వారికి వీటిపై అవగాహన ఉంటుంది. అందుకే టార్గెట్ చేయాలనుకున్న వారిని సాలిడ్‌గా ఆయా కంపెనీలపై దాడులు చేయడం ద్వారా చేస్తారు. తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులు కూడా ఆ కోణంలోనివేనా అన్న చర్చ జరుగుతోంది. వేల కోట్ల వ్యాపారాలు చేసే బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు రాజకీయ సంబంధాలు లేకుండా ఉండవు. అందుకే తెలంగాణలో ఎప్పుడు ఐటీ దాడులు జరిగినా.. ఆ సంస్థలు ఎవరివి.. వారు ఎవరికి సన్నిహితులన్న గుసగుసలు వినిపిస్తూంటాయి. మరి తాజాగా ఐటీ దాడులు జరుగుతున్న వాసవి గ్రూప్‌ లింకులు ఉన్నది ఏ పార్టీకో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెదనాన్న మన గుండెల్లో వున్నారు : ప్రభాస్

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభాస్‌ ఇక్కడకు చేరుకున్నారు. తమ అభిమాన...

లక్ష్మిపార్వతి అంత ధైర్యం కొడాలి నానికి లేదా !?

ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి యుగపురుషుడి పేరు తీసేయడంపై మెల్లగా వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ముసుగు తీసేస్తున్నారు. సమర్థిస్తూ ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకువచ్చి మాట్లాడుతున్నారు. పెద్ద...

మహేష్ బాబు ఇంటిలో చోరికి యత్నం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో చోరికి ప్రయత్నించాడు ఓ దొంగ. ఓ అగంతకుడు మహేష్ బాబు ఇంటి గోడ దూకి లోపలికి వచ్చాడు. మంగళవారం రాత్రి సమయంలో లో చోరీ ప్రయత్నం...

స్వాతిముత్యం పై త్రివిక్రమ్ స్టాంప్

హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‏టైన్మెంట్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హోమ్ బ్యానర్లు. కేవలం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ని కేటాయించారు నిర్మాత చినబాబు. ఇక సితారలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close