నర్సాపురం ఎంపీ ఇక లేఖలు ఆపేస్తారా..?

రఘురామకృష్ణరాజును ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన… వైసీపీ ఒక అడుగు వేస్తే.. ఆయన రెండు అడుగులు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తూ వస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు పోలీసు కేసుల వ్యూహానికి వచ్చారు. తమకు కించ పరుస్తున్నారంటూ.. వైసీపీ నేతలు పోలీసులకు వరుసగా పిర్యాదులు చేయడం ప్రారంభించారు. ఒకరో ఇద్దరో చేస్తే.. వ్యక్తిగతంగా హర్ట్ అయ్యి.. ఫిర్యాదు చేశారని అనుకోవచ్చు.. కానీ అందరూ… వరుసపెట్టి చేస్తున్నారంటే.. అది తాడేపల్లి నుంచి వచ్చిన సంకేతాల ప్రకారమేనని.. సులువుగానే అర్థం చేసుకుంటున్నారు. ఇలాంటి ఫిర్యాదులతో వైసీపీ ఏం సాధించాలనుకుంటున్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రఘురామకృష్ణరాజు.. వివిధ అంశాలపై ఇటీవల లేఖలు రాయడం ప్రారంభించారు. అవ్వాతాతలకు రూ. 15వేలకుపైగానే బాకీ ఉన్నామని.. అవి తిరిగి ఇవ్వాలంటూ లేఖలు రాశారు. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వ పథకాల లోపాలన్నింటినీ వెలుగులోకి తీసుకు వచ్చి చర్చ పెట్టాలనుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిచింది. ఇది వైసీపీలో కలకలం రేపింది. ఆయనను ఎలాగైనా కంట్రోల్ చేయకపోతే.. అంతకు మించి డ్యామేజ్ జరుగుతుందన్న అంచనాకు వచ్చి … కేసుల వ్యూహాన్ని ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు. దీనికి ఖచ్చితంగా రఘురాకృష్ణరాజు భయపడతారని… వెనక్కి తగ్గుతారని.. వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో పోలీసు వ్యవస్థ .. ప్రభుత్వ పెద్దలు ఎవర్ని అరెస్ట్ చేయాలనుకుంటే.. వారిని అరెస్ట్ చేస్తోంది. ఆధారాలు ఉన్నాయని ప్రకటించేసుకుని.. ప్రాథమిక విచారణ కూడా లేకుండా.. పని పూర్తి చేస్తోంది. ఆపరేషన్లు జరిగాయా… ప్రాణాలతో ఉంటారా లాంటివేమీ చూసుకోవడం లేదు. చట్టంలో ఉన్న వెసులుబాట్లను రాజకీయ లక్ష్యాలను సాధించడానికి వాడుకుంటున్నారు. అలా రఘురామకృష్ణరాజును కూడా అరెస్ట్ చేస్తామన్న సంకేతాలను.. ప్రస్తుత ఫిర్యాదుల ద్వారా పంపుతున్నారని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టారనే అంశాలు ఉన్నాయి. ఇప్పటికైతే.. వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఫిర్యాదులపై కేసులు నమోదు చేయలేదు. న్యాయసలహా తీసుకుని ముందుకెళ్తామంటున్నారు. ఇప్పుడు ఏపీలో న్యాయసలహాలు కూడా.. ఎలా కావాలంటే అలా ఇచ్చే వ్యవస్ధ ఉంది. దాంతో రఘురామకృష్ణరాజు… లేఖలు రాయడం ఆపలేకపోతే..కేసులు.. అరెస్టులు తప్పవన్న హెచ్చరికలు నేరుగానే… అధికార పార్టీ పంపుతోందని భావించవచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అఖిల్ – సురేంద‌ర్ రెడ్డి ఫిక్స్

`సైరా` త‌ర‌వాత సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టు ఎవ‌రితో అన్న విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. అగ్ర హీరోలంతా బిజీ బిజీగా ఉండ‌డంతో.. సురేంద‌ర్ రెడ్డికి అనుకోని విరామం తీసుకోవాల్సివ‌చ్చింది. కొంత‌మంది కోసం క‌థ‌లు సిద్ధం...

సచివాలయం గాయబ్..!

దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్ర పాలనా కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం పదకొండు భవనాలను నామరూపాల్లేకుండా తొలగించేశారు. శరవేగంగా ఇరవై ఐదు...

విశాఖకు వచ్చింది ఆ “బోస్టన్” కాదు… అలాంటిది..!

విశాఖకు బోస్టన్ అంటూ.. రెండు రోజుల నుంచి వైసీపీ మీడియా.. సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. ప్రభుత్వం ఎంవోయూ కూడా చేసుకుంది. అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న రత్నాకర్ పండుగాయల .....

మళ్లీ తెర ముందుకొచ్చిన టీ పీసీసీ “రేసర్లు” ..!

రెండు రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన కొంత మంది నేతలు హడావుడిగా మీడియా ముందుకు వచ్చి తాము పీసీసీ రేసులో ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ పదవి గురించి ఢిల్లీలో ఏ...

HOT NEWS

[X] Close
[X] Close