దూబే హతం..! బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే ఆన్సర్..!

యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను.. యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అతనిని కాపాడేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో.. మరో విమర్శకు తావివ్వకుండా…యూపీ శివార్లలోనే ఎన్‌కౌంటర్ చేసేశారు. డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసుల్ని అత్యంత దారుణంగా కాల్చి పడేసిన దూబే గ్యాంగ్… ఆ తర్వాత తప్పించుకుంది. ఆ తర్వాత దొరికిన వారిని దొరికినట్లుగా కాల్చిపడేసిన యూపీ పోలీసులకు దూబే మాత్రం దొరకలేదు. ఆనూహ్యంగా ఆయన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పోలీసులకు చిక్కాడు. ఆయనను కాపాడేందుకు.. అక్కడ పోలీసులకు లొంగిపోయేలా చేశారన్న విమర్శలు వచ్చాయి. ట్రాన్సిట్‌ వారెంట్‌తో యూపీ పోలీసులు దూబేను అదుపులోకి తీసుకుని యూపీకి తరలించే సమయంలో.. మధ్యలో… పోలీసుల వద్ద గన్ లాక్కుని కాల్పులు జరబోయాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు తిరిగి కాల్పులు జరపడంతో దూబే ఎక్‌కౌంటరయ్యాడు.

ఈ వికాస్ దూబే. మామూలోడు కాదు. ఇరవై ఏళ్ల కిందటే.. అప్పట్లో ఇప్పటి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన కేబినెట్‌లోని మంత్రిని.. పోలీస్ స్టేషన్‌లో కాల్చి పడేసిన చరిత్ర ఉంది. అప్పటి నుండి ఆయన రౌడీగానే చెలామణి అవుతున్నారు. ఒక్క కేసులోనూ శిక్ష పడలేదు. కొన్ని సార్లు జైలు నుంచే మర్డర్లకు స్కెచ్ వేయించారు. అన్నీ తెలిసినా … పోలీసులు దూబే జోలికి వెళ్లలేకపోయారు. అన్ని రాజకీయ పార్టీలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. అక్కడి గ్రామ రాజకీయాలను ఆయన శాసిస్తారు. అందుకే పోలీసులు కూడా లైట్ తీసుకుంటారు.

యూపీలో యోగి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడి రౌడీలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. నిజంగా చంపిందో లేదో కానీ.. కొన్ని వందల మంది రౌడీలను ఎన్ కౌంటర్ చేశామని.. యూపీలో శాంతిభద్రతలకు ఢోకా లేదని.. చెబుతూ ఉంటుంది. కానీ అక్కడ ఎంత మంది రౌడీలను ఎన్ కౌంటర్ చేసినా.. పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఉన్న వారిలో భయం కలగలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పోలీసుల కాల్చివేత తర్వాత వికాస్ దూబే గ్యాంగ్‌లోని వారందర్నీ దాదాపుగా ఎన్‌కౌంటర్ చేసేశారు. ఇప్పుడైనా.. యూపీలో పరిస్థితి మారుతుందో లేదో మరి.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close