మూడుశాతం కూడా eలిటరసీ లేని దేశం! ‘డిజిటల్ ఇండియా’తో ఎవరికి ప్రయోజనం?

వేగవంతమైన సమాచార హైవేల ద్వారా పలు రకాల సమాచార లైబ్రరీల అనుసంధానం చేసి ప్రజలకు దానిని అందుబాటులోకి తేవాలన్నది డిజిటల్‌ ఇండియా కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. డిజిటల్‌ ఇండియాకు అన్ని రకాలుగా సహకరిస్తామనీ దేశ విదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం శుభ పరిమాణం.

”మాట్లాడుతూనే వుండండి” అని దీరూబాయ్ అంబానీ ఈ దేశానికి పిలుపు ఇచ్చారు. అది పోస్టుకార్డు కంటే తక్కువగా పది పైసల  కాల్ చార్జీతో రిలయన్స్ కమ్యునికేషన్స్ ప్రారంభమైనప్పడు అది అంబానీ ఇచ్చిన నినాదం. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు..జీవితంలోని అన్ని ఎమోషన్లనీ వినే వాళ్ళు దొరికతే అదేపనిగా వెళ్ళబుచ్చుకోవడం మన జీవనవిధానంలో భాగమైపోయింది. దాన్ని పసిగట్టిన అంబానీ వ్యాపారంపెట్టి బాగానే సొమ్ము చేసుకున్నారు. అయితే మొబైల్‌ ఫోన్ ఉన్నాదానిని మాట్లాడడానికే తప్ప నంబర్‌ సేవ్‌ చేసుకోవడం, మెసేజ్‌ పంపడం లాంటివి కూడా చాలా తక్కువ మందికి తెలుసు. ఎలక్ట్రానిక్  సమాచారాన్ని అందుకునే దేశాల సూచిలో ఇండియా 90వ స్థానంలో ఉంది. బ్రాడ్‌బాండ్‌ వినియోగదారులు దాదాపు 10 కోట్ల మంది ఉన్నారు అయనాకూడా ఇంటర్‌నెట్‌ స్పీడ్‌ ఇండెక్స్‌లో ఇండియా 115వ స్థానంలో ఉంది. ఇంటర్‌ నెట్‌తో సెల్‌ఫోన్ల అనుసంధానం పెరిగిన తరువాత ఫోన్‌ బిల్లులు పెరిగాయి. సినిమా పాటలు, వార్తలు, నీలి చాత్రాల వంటి కాలక్షేప సరదాల కోసం ఇంటర్‌నెట్‌ను వాడే వారి సంఖ్య ఎక్కువ.

ఇలాంటి సాంకేతిక, కమ్యునికేషన్ల నేపధ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ”డిజిటల్ ఇండియా” ప్రాజెక్టుని భుజానవేసుకున్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా, నైపుణ్య భారతం, డిజిటల్‌ ఇండియా లాంటి నినాదాలు బాగానే ఉంటాయి వాటి అమలు ఎలా ఉంటుందన్నదే సమస్య. మొబైల్ ఫోన్ల యజమానులలో స్మార్ట ఫోన్ వినియోగం తెలిసిన వారు 15 శాతం మంది కూడా లేనపుడు, కంప్యూటర్ లను ‘స్మార్ట్’గా ఉపయోగించకునే వారి సంఖ్య ఇంకా తక్కువే వుంటుంది. దేశంలో రెండున్నర లక్షల గ్రామపంచాయితీలను ఆప్టిక్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా అనుసంధానిస్తామని ఐదేళ్ల క్రితం పాత ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు పని అరకొరగానే జరిగింది. ఖర్చు మాత్రం 20 వేల కోట్లు అని తేలింది. ఇప్పుడు డిజిటల్‌ ఇండియా ద్వారా 10లక్షల జనాభా పైబడిన నగరాలను, అన్ని విశ్వవిద్యాలయాలను, మరి కొన్ని విద్యసంస్థలను వైఫై సంస్థ లుగా మార్చనున్నారు. డిజిటల్‌ విప్లవంలో భాగంగా అనుదినపు ప్రభుత్వ, సామాజిక అవసరాలను తీర్చేలా డిజిటల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యం. దీనిలో భాగంగా ఈ-పాలనను ప్రోత్సహిస్తారు. ఈ- పాలన అంటే ఎలక్ట్రానిక్ పాలన కాదనీ ఈజీ ఎకనామికల్‌ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివరణ ఇచ్చారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమం ద్వారా కోటి 70 లక్షల మంది శిక్షణ పొందుతారు. వీరికి ఉపాధి కల్పించడంతో పాటు దాదాపు 8.5 కోట్ల మంది పరోక్ష ఉపాధి పొందుతారని అధికారుల అంచనా. వాతావరణ వివరాలు, రైతుల పంటలు, ధరలు, ఈ వైద్యం, బ్యాంకింగ్‌ సేవలు, బిల్లుల చెల్లింపు, వార్తా ప్రసారాల వేగం తదితర సౌకర్యాలు మెరుగుపర్చాలన్న లక్ష్యం కూడా డిజిటల్‌ ఇండియాలో ఉంది. ఈ కార్యక్రమం అనుకున్నట్లు అమలయితే సోషల్‌ మీడియా మరింత అభివృద్ధి చెందుతుంది.
మార్కెట్‌ సంస్థలకు మొబైల్‌ ఫోన్‌ మంచి మాధ్యమమైంది. రకరకాల యాప్స్‌తో ఆకర్షణీయమైన ఆఫర్స్‌తో మార్కెటింగ్‌ సంస్థలు జనాల మీద విరుచు పడుతున్నాయి. అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు వినూత్న మార్కెట్‌ విధానాలతో రోజుకు ఒక్కొక్కరు ఆరేసి వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేశారు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలకు కట్టాలసిన పన్నులను ఎగవేసి కస్టమర్లకు కొంత లాభం చూపించి వారు కోట్లాది రూపాయలను దండుకున్నారు. ఇలా వ్యాపార వర్గాల వారు డిజిటలైజేషన్‌ను వారి లాభార్జనకోసం మాత్రమే  వినియోగించుకునే అవకాశం గట్టిగా వుంది. ప్రభుత్వ విధానంలో ఈ – పాలన ద్వారా సేవల నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వ ఉద్దేశం. విజ్ఞాన బాండాగారంతో అనుసంధానం, పారదర్శక పాలన, వాబుదారి తనం, పేపర్‌ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు సహకరించడం, పాలనలో వేగం లాంటి సౌకర్యాలను పెంపొదిస్తామనీ ప్రభుత్వం చెపుతున్నది. కానీ డిజిటలైజేషన్‌ అన్నది ప్రజల కన్న పాలకులకే ఎక్కువ మేలు చేస్తుందనీ విజ్ఞుల ఉద్దేశం. లక్షలాది మంది సాఫ్ట్‌వేరు నిపుణులను అందించిన ఇండియాలో ఈ-లిటరసీ మూడు శాతం మందికి కూడా అందుబాటులోకి రాలేన్నది వాస్తవం. దేశంలో దాదాపు 70 కోట్ల మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి. మొబైల్‌ ఫోన్లు లేని జనం కూడా దాదాపు ఇంతే సంఖ్యలో ఉంటారు.

2017 మార్చిలో 32వేల కోట్ల రూపాయలతో రెండున్నర లక్షల గ్రామాలకు బ్రాడ్‌ బాండ్‌, ఆఫ్టిక్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఏర్పచనున్నారు. పెరిగే సౌకర్యాలను సుపరిపాలన కోసం వినియోగించుకుంటారో, మార్కెట్‌ సంస్థలకు కొత్త మార్గలకు తెరిచి పెడతారో తెలియదు. ఆధునిక సౌకర్యాలు విజ్ఞతతో వినియోగించుకునే సంస్కృతిని జనాల్లో పెంపోందించడంతో పాటు వ్యాపార వర్గాలను అదుపుచేసే విషయంలో ప్రభుత్వం సమర్థతను కనబర్చక పోతే డిజిటల్‌ ఇండియా సౌకర్యాలు దుర్వినియోగం అవుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీ కొత్త సీఎంగా ఆమెకే బాధ్యతలు

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ నేత, విద్యాశాఖ మంత్రి అతిశీ మర్లీనా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అతిశీకి సీఎం పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. కేజ్రీవాల్...

జానీ మాస్ట‌ర్ కేసు: ఛాంబ‌ర్ ఏం చేస్తోంది?

జానీ మాస్ట‌ర్ పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు అవ్వ‌డంతో ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. హేమ క‌మిటీ నివేదిక దేశం మొత్తాన్ని షేక్ చేస్తున్న నేప‌థ్యంలో ఇలాంటి విష‌యాల్ని సీరియ‌స్ గా తీసుకొని,...

నెల్లూరులోనూ పెరుగుతున్న గేటెడ్ విల్లాల సంస్కృతి

ప్రజలు రాను రాను జీవన విధానంలో మార్పులు కోరుకుంటున్నారు. పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇళ్ల చుట్టూ రణగొణ ధ్వనులు.. ఇతర...

హైడ్రా ఆగ‌దు… సీఎం రేవంత్ రెడ్డి పున‌రుద్ఘాట‌న‌!

హైడ్రా ఆగ‌దు... సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌తిసారి చెప్తున్న మాటే. అయితే, చెరువుల్లో, బ‌ఫ‌ర్ జోన్ల‌లో ఇప్ప‌టికే నివాసం ఉంటున్న సామాన్యుల జోలికి వెళ్ల‌ము అని హైడ్రా ప్ర‌క‌టించాక‌, దూకుడు త‌గ్గిన‌ట్లేన‌న్న అభిప్రాయం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close