జ‌న‌సేన వ్యూహకర్త : దేవ్‌… వాసుదేవ్‌ .. కేరాఫ్ చింత‌ల్ బ‌స్తీ ..!

జ‌న‌సేన పార్టీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా దేవ్ ని నియమిస్తూ నిన్న‌నే అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పరిచయం చేశారు. వైకాపాకి ప్ర‌శాంత్ కిషోర్ ఎంతో… జ‌న‌సేన‌కి ఈయ‌న అంతే అనే స్థాయి అన్న‌ట్టుగా బిల్డ‌ప్ ఇచ్చారు. ఇక‌, దేవ్ మాట్లాడుతూ… త‌న‌కు తెలుగు స‌రిగా రాద‌నీ, కొంచెం కొంచెం వచ్చ‌ు అన‌ట్టుగా ఇంగ్లిష్ లో ప్ర‌సంగించారు. గ‌డ‌చిన ద‌శాబ్దకాలంలో తనకు కొన్ని జాతీయ, అంత‌ర్జాతీయ పార్టీల‌కు పని చేసిన అనుభ‌వం ఉంద‌న్నారు. ఎన్నిక‌లు, స‌ర్వేలు, వ్యూహాలు.. ఇలాంటి విష‌యాల్లో త‌న‌కు చాలా చాలా అనుభ‌వం ఉంద‌ని కూడా చెప్పుకున్నారు. త‌న‌కు ఉన్న అనుభ‌వాన్ని అంతా రంగ‌రించి… త‌న వ్యూహాలు, ఇన్ పుట్స్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆలోచ‌న‌లూ సిద్ధాంతాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్దామ‌న్నారు. అంద‌రం క‌లిసి జ‌న‌సేన‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేద్దామ‌ని చెప్పారు. అతనికి 350 మంది ఉద్యోగులు ఉన్న పొలిటికల్ స్త్రాటెజీస్ కంపెని ఉందని కూడా పవన్ చెప్పారు.

ఇదీ దేవ్ ఇంట్రొడ‌క్ష‌న్‌..! దీంతో ఈ దేవ్ ఎవ‌రూ..? ప్ర‌శాంత్ కిశోర్ స్థాయి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్తా..? ఆయ‌న ఇంత‌కాలం సేవ‌లందించిన జాతీయ పార్టీలేవి, అంత‌ర్జాతీయ పార్టీలేవి..? త‌డ‌బ‌డుతూ తెలుగు మాట్లాడుతున్నారంటూ… ఇన్నాళ్లూ ఈయ‌న ఎక్క‌డున్న‌ట్టు, ఈయన పుట్టి పెరిగిందెక్కడ.. అనే విష‌యాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కానీ, అస‌లు విష‌యం ఏంటంటే… ఈ దేవ్ అస‌లు పేరు ఏమనగా.. వాసుదేవ్‌..! పుట్టింది, పెరిగింది కేరాఫ్ చింత‌ల్ బ‌స్తీ, తెలంగాణ‌, మన పక్కా లోకల్! తెలుగులో మాట్లాడ‌టం భేషుగ్గా వ‌చ్చు. గ‌తంలో ఈయ‌న భారతీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌తినిధిగా కూడా ప‌నిచేశారు. ఆ సంద‌ర్భంగా వివిధ న్యూస్ ఛానెల్స్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేవారు. ఈయ‌న తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడు దామోద‌ర్ రాజ‌న‌ర‌సింహ‌కి బంధువు.

సో.. ఇదండీ ఈయ‌న నేప‌థ్యం. మ‌రి, ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించాన‌నీ, స‌ర్వేలు చేయించాన‌నీ, ద‌శాబ్దకాలం అనుభ‌వం ఉంద‌నీ… జాతీయ పార్టీలేం ఖ‌ర్మ‌, అంత‌ర్జాతీయ పార్టీల‌తో ప‌నిచేసిన అనుభ‌వం తనదని ప‌రిచ‌యం చేసుకోవ‌డం విడ్డూరం..! ఇంకా విచిత్రం ఏంటంటే… చ‌క్క‌టి తెలంగాణ మాండ‌లికంలో మాట్లాడ‌టం వ‌చ్చి కూడా త‌న‌కు తెలుగు పెద్ద‌గా రాద‌ని చెప్పుకోవ‌డం!

టీవీ చ‌ర్చ‌ల్లో అప్పుడ‌ప్పుడూ పాల్గొనే ఒక సాధార‌ణ స్థాయి కార్య‌క‌ర్త‌ను తీసుకొచ్చి… వ్యూహ‌క‌ర్త అని ప‌వ‌న్ ప‌రిచ‌యం చేయ‌డం ఏమ‌నుకోవాలో అర్థం కావ‌డం లేదు. త‌న గురించి భారీ బిల్డ‌ప్పులు ఇచ్చుకుంటూ ప‌వ‌న్ ని ఆయ‌నే బుట్ట‌లో ప‌డేశారా, లేదా దేవ్ నియాక‌మం వెన‌క కూడా భాజ‌పా క‌నెక్ష‌న్ ఉందా..?

 

When Dev ( Vasudev ) Joining BJP

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close