బాల‌య్య సినిమాకి ద‌ర్శ‌కుడెవ‌రు?

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ ఓ సినిమా చేయాలి. ఇది వ‌ర‌కే.. ఈ సినిమా ప‌ట్టాలెక్కాల్సింది. కానీ కుద‌ర్లేదు. ఇప్పుడు అర్జెంటుగా బాల‌య్య కోసం ఓ క‌థ రెడీ చేసే ప‌నిలో ప‌డింది సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌. అందుకోసం క‌థ‌ల్ని అన్వేషిస్తోంది. ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది.. సితార‌కు ఓ క‌థ వినిపించాడు. అది ఆల్మోస్ట్ ఫైన‌ల్ అనుకుంటున్నారు. ఈలోగా.. బాబి కూడా ఓ క‌థ చెప్పాడ‌ని తెలుస్తోంది. ఈ రెండు క‌థ‌ల మ‌ధ్య సితార ఊగిస‌లాడుతోంది. ఈ రెండు క‌థ‌లూ బాల‌య్య ముందు పెట్టాల‌ని, ఏ క‌థ ఎంచుకుంటారన్న నిర్ణ‌యం ఆయ‌న‌కే వ‌దిలేయాల‌ని సితార భావిస్తోంది. బాబి చేతిలో చిరంజీవి సినిమా ఉంది. అది పూర్తి చేశాకే బాల‌య్య సినిమా ఉంటుంది. ఈలోగా బాల‌య్య చేతిలో ఉన్న గోపీచంద్ మ‌లినేని సినిమా పూర్త‌వుతుంది. సంప‌త్ అయితే ప్ర‌స్తుతానికి ఖాళీగా ఉన్నాడు. త‌ను మాస్ సినిమాల్ని బాగా తీయ‌గ‌ల‌డు కాబ‌ట్టి.. బాల‌య్య సంప‌త్ క‌థ‌నే ఓకే చేసే అవ‌కాశాలున్నాయి. ఏది ఏమైనా బాల‌య్య – సితార కాంబోలో ద‌ర్శ‌కుడు ఎవ‌రన్న‌ది ఈ నెలాఖరులోగా తేలిపోవ‌చ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close