తెలుగు వాళ్ళైన హీరో జయం రవి, డైరెక్టర్ మోహన్రాజాలు రీమేక్ సినిమాలతోనే మీడియం రేంజ్ స్టార్ ఢం తెచ్చుకున్నారు. ఆ తర్వాత నుంచి వరుసగా బోలెడన్ని ఫ్లాప్స్ ఇచ్చి ఇంచుమించుగా ఫేడవుట్ అయ్యే పొజిషన్‌కి దగ్గరగా వెళ్ళారు. కొన్ని గట్టి దెబ్బలు తిన్న తర్వాత… చేసిన తప్పులు ఏంటో తెలుసుకున్న బ్రదర్స్ ఇద్దరూ కూడా ఓ మంచి థ్రిల్లర్…. అది కూడా ఫ్రెష్ కాన్సెప్ట్‌కి స్టైలిష్ ట్రీట్మెంట్ని జోడించి ‘థనీ ఒరువన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. రచ్చ సినిమా నుంచి మాస్ మసాల సినిమాలంటూ రొటీన్ సినిమాలు తీసి తీసి ఓవర్సీస్, క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కూడా దూరమైన రామ్ చరణ్‌కి ఓ మంచి సబ్జెక్ట్‌ని ఇచ్చారు. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన ‘ధృవ’ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రోమోస్ చూస్తూ ఉంటే మెగా హీరో రామ్ చరణ్ తేజ్ ఈ సారి కాస్త కొత్తగా ట్రై చేసినట్టుగానే కనిపిస్తోంది.
ఇక అసలు విషయానికి వస్తే ‘థనీ ఒరువన్’ సినిమా హీరోలు అయిన అరవింద్ స్వామి, జయం రవిలు ఇఫ్పుడు ‘బోగన్’ అనే మరో కొత్త సినిమాతో వస్తున్నారు. థనీ ఒరువన్ సినిమాలో అరవింద్ స్వామిది నెగిటివ్ రోల్. అయినప్పటికీ సినిమాని నిలబెట్టిన ఇద్దరు హీరోలు ఎవరంటే మాత్రం అరవింద్ స్వామి, జయం రవిల పేర్లే ముందు చెప్పుకోవాలి. అరవింద్ స్వామి, జయం రవిలు ఇద్దరూ ఇప్పుడు బోగన్ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నమే చేసినట్టుగా ఉన్నారు. హీరో ఎవరు? విలన్ ఎవరు? ఎవరికెంత స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి? అని లెక్కలు వేసుకోకుండా ఇప్పుడు మరోసారి మరో ఇంట్రెస్టింగ్ కథతోనే వస్తున్నట్టున్నారు. ఆల్రెడీ ‘బోగన్’ సినిమా టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సారి కూడా జయం రవి, అరవింద్ స్వామిల యాక్టింగే సూపర్బ్ హైలైట్ అయింది. డిసెంబర్లో రిలీజ్ అవనున్న ఈ సినిమాకు హిట్ లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ ‘బోగన్’ రీమేక్ ఆఫర్ ఏ తెలుగు హీరో దగ్గరకు వస్తుందో, మనవాళ్ళు ఎన్ని కోట్లు పెట్టి ఈ సినిమా రీమేక్ రైట్స్ కొంటారో చూడాలి మరి.