కరోనా విషయంలో దేశమంతా జగన్ ని అనుసరిస్తోంది : విజయసాయి

ఎవరేమనుకున్నా పర్వాలేదు నాకు తోచినట్టు నేను రాస్తా అన్నట్టుగా ఉంది ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహార శైలి. తాజాగా కరోనా విషయంలో దేశమంతా జగన్ ని అనుసరిస్తోంది అంటూ ఆయన చేసిన ట్వీట్ చూసిన నెటిజన్లు, విజయసాయి ని చూసి నవ్వాలో జాలి పడాలో తెలియడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు .‌వివరాల్లోకి వెళితే..

జగన్ తీసుకున్న అసాధారణమైన చర్యల వల్లే ఆంధ్రప్రదేశ్లో కరోనా అదుపులో ఉంది అంటూ ఈరోజు ట్వీట్ చేశారు విజయసాయి. ఆయన ట్వీట్ చేస్తూ, ” దూరదృష్టి, ప్రజల పట్ల బాధ్యత, ఎటువంటి పరిస్థితులనైనా అదుపు చేయగల నాయకుడే ఇవ్వాల్టి అవసరం. దేశమంతా భీతిల్లుతున్నా సిఎం జగన్ గారు తీసుకున్న ముందస్తు చర్యలు, ప్రభుత్వ యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేసి కరోనా మహమ్మారిపై యుద్ధం ప్రకటించడం అసాధారణం. దేశమంతా ఆయన మార్గాన్ని అనుసరిస్తుంది . అతి తక్కువ కరోనా పీడితులతో రాష్ట్ర ప్రజలు నిర్భయంగా ఉండటం పచ్చ పార్టీ, దాని కిరాయి మేధావులకు కంటగింపుగా మారింది. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం జీర్ణించుకోలేక పోతున్నారు. మరో వైపు హైదరాబాద్ లో ఉంటున్న వారిని ఉసిగొల్పే కుట్రలకు తెరలేపారు.” అంటూ రాసుకొచ్చారు.

జగన్ తీసుకుంటున్న చర్యలు దేశానికే ఆదర్శమట:

నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం నామ మాత్రంగా ఉంది. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తో పోలిస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కూడా తక్కువే. ఇవే కాకుండా ఇంకా పలు రకాల కారణాల వల్ల అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి జడలు విప్పలేదు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాలతో పోలిస్తే మిగిలిన రాష్ట్రాల్లో కరోనా కేసులు తక్కువ గానే నమోదవుతున్నాయి. లాక్ డౌన్, రైలు వంటి రవాణా మార్గాలను మూసివేయడం కారణంగా కూడా రాష్ట్రాల మధ్య కరోనా వ్యాప్తి తక్కువగానే ఉంది. అయితే ఈ కారణాలు ఏమీ పట్టించుకోకుండా, అర్జెంటుగా జగన్ కి క్రెడిట్ ఇవ్వాలనే తాపత్రయం విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలో కనిపిస్తుంది.

హాస్టల్లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు సొంతూరికి బయల్దేరడం కూడా రాజకీయ కుట్రట:

అయితే ఎంతటి పచ్చి అబద్ధం అయినా నిర్భయంగా పదేపదే చెబుతూ ఉంటే జనాలు అదే నిజమైన నమ్మేస్తారు అనుకుంటున్నట్లుగా ఉంది విజయసాయి శైలి. హైదరాబాదులో హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు, బ్యాచిలర్స్ అనివార్య పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిలో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ లోని తమ సొంత ఇంటికి బయలు దేరితే, దాన్ని కూడా ప్రత్యర్థి పార్టీలు చేసిన కుట్ర అంటూ వారిని రాజకీయ పార్టీలు ఉసిగొల్పారు అంటూ ఎంపీ స్థాయిలో ఉన్న విజయసాయిరెడ్డి రాయడం చూసి నెటిజన్లు ఈసడించుకుంటున్నారు.

గ్రామ వాలంటీర్లకు హెల్త్ వాలంటీర్లకు తేడా తెలియని విజయసాయి అంటూ విమర్శలు:

మొన్నీ మధ్య విజయసాయి పెట్టిన మరొక ట్వీట్ కూడా ఇలాగే విమర్శల పాలయింది. “సిఎం జగన్ గారు ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శంగా మారుతోంది. యుకె ప్రభుత్వ నేషనల్ హెల్త్ సర్వీస్(NHS) 2.80 లక్షల మంది వలంటీర్ల అవసరముందని ప్రకటించి అత్యవసర నియామకాలు చేపట్టింది. ఇంతకంటే ప్రశంస ఏం కావాలి మన వలంటీర్ వ్యవస్థకు.” అంటూ ఆయన చేసిన ట్వీట్ చూసి జనాలు నవ్వుకుంటున్నారు. వాలంటీర్ అన్న పదం తప్ప, మెడికల్ రంగంలో అనుభవం ఉన్న హెల్త్ వాలంటీర్లకు, రేషన్ కార్డు ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ కోసం ఏర్పాటుచేసిన గ్రామ వాలంటీర్లకు ఏ మాత్రం సారూప్యం లేదని తెలిసి కూడా తమ పార్టీ అభిమానులను, క్యాడర్ ను సంతృప్తిపరచడానికి, మభ్యపెట్టడానికి ఆయన ట్వీట్ పెట్టి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏది ఏమైనా రాజకీయాలు పక్కనపెట్టి కరోనా ని కట్టడి చేయడానికి ప్రయత్నించాల్సిన ప్రస్తుత తరుణం లో కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన పాకులాడుతున్న తీరు విమర్శలకు గురవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

ఫ్లాష్ బ్యాక్‌: సూప‌ర్ స్టార్స్ అడిగితే సినిమా చేయ‌నన్నారు

ఓ స్టార్ హీరో పిలిచి - ఓ కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తే, కాదంటాడా? చేయ‌నంటాడా? ఎగిరి గంతేస్తాడు. త‌న ద‌గ్గ‌ర క‌థ లేక‌పోయినా అప్ప‌టిక‌ప్పుడు వండేస్తాడు. మీతో సినిమా చేయ‌డంతో నా జ‌న్మ ధ‌న్యం అంటాడు....

HOT NEWS

[X] Close
[X] Close