వేసవి కాలం భారతీయుల్ని కాపాడుతోందా..?

ప్రస్తుతం భారత్‌లో ఉన్న వాతారవణ పరిస్థితులు కూడా.. కరోనా నియంత్రణకు సరైన సమయంగా కొంత మంది నిపుణులు అంచనా చేస్తున్నారు. సైంటిఫిక్‌గా నిర్ధారణ కాకపోయినా ప్రస్తుతం.. చల్లగా ఉండే దేశాల్లో కరోనా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోంది. భారత్‌లో ఇప్పుడు వేసవి కాలం. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇటలీలో ప్రస్తుతం పది డిగ్రీలు, స్పెయిన్‌ లో పదహారు డిగ్రీలు, అమెరికాలో తొమ్మిది డిగ్రీలు, జర్మనీలో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతూ ఉంటాయి. ఇండియాలో సగటున ఇది 30 వరకూ ఉంది. ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆయా దేశాలతో పోలిస్తే..భారత్‌లో కరోనా ప్రభావం తక్కువే ఉంది. ఈ ప్రకారం అంచనా వేసుకున్నా… వేడి వాతారవణంలో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు.

నిపుణులు కూడా.. వర్షకాలంలో వచ్చేలోపే… కరోనాను కట్టడి చేయాలని .. సూచనలు ఇస్తున్నారు. వేడి వాతారవణంలో కరోనా బతకదని మొదట సైంటిస్టులు అంచనా వేశారు. కానీ ఎడారి దేశాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నా.. తీవ్ర ప్రభావం చూపింది. అయితే.. ఎలాంటి వైరస్ అయినా.. దాని ఉనికి వాతావరణం… పరిశుభ్రత మీద ఆధారపడి ఉంటుందనేది మాత్రం నిజం. వుహాన్ సిటీలో వైరస్ పుట్టినప్పుడు జనవరిలో అక్కడ జీరో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలోని సియోల్‌లో కూడా.. కరోనా విజృంభించినప్పుడు.. జీరో ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇటలీ, ఇరాన్‌లలో కూజా కరోనా తీవ్ర ప్రభావం చూపినప్పుడు.. జీరో రేంజ్ ఉష్ణోగ్రతలే ఉన్నాయి. కరోనా వైరస్ భారత్‌లో వెలుగు చూసినప్పుడు.. భారత్‌లో చలికాలం. జనవరి 30వ తేదీన ఢిల్లీలో తొలి కేసు వెలుగు చూసింది. అప్పుడు ఢిల్లీలో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత 5 డిగ్రిలు. ఇప్పుడు దాదాపుగా 30కి చేరువ అవుతోంది.

ఈ తరహా వాతావరణంలో ప్రాణాంతక వైరస్‌లు మనుగడ సాగించడం శక్తివంతంగా మారడం కష్టమేనని నిపుణులు చెబుతున్నాయి. వైరస్‌లు తక్కువ ఉష్ణోగ్రతలలో వృద్ధి చెందుతాయనేది సైంటిఫిక్‌గా నిరూపితమైన అంశం. ప్రస్తుతం వేసవి ప్రారంభమైంది. లాక్ డౌన్ ద్వారా సామాజిక దూరం పాటిస్తూ.. కరోనా ఒకరి నుంచి మరొకరికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీని వల్ల సామాజిక వ్యాప్తి అనేది.. చాలా ఎక్కువగా నిలిచిపోయింది. అదే సమయంలో.. వాతావరణ సహకారం కూడా ఉందని అనుకోవచ్చు. ఇప్పుడు.. లాక్ డౌన్ వల్ల.. ఈ చైన్‌ను తెంపేయగలిగినట్లయితే.. మే వరకూ ఉండే ఎండల వల్ల.. పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వర్షాకాలం ప్రారంభమయ్యే లోపు… ఈ వైరస్‌పై పూర్తి స్థాయిలో విజయం సాధించకపోతే.. మళ్లీ.. లాక్ డౌన్ లాంటి కష్టాలకు సిద్ధపడాల్సిన పరిస్థితి వచ్చినా రావొచ్చనేది నిపుణుల అంచనా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close