బీజేపీతో షేక్‌హ్యాండ్‌ కోసం చంద్రబాబుకు ఎందుకింత ఆరాటం..!?

భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళితే.. పుట్టి మునుగుతుందని గట్టిగా నమ్మి.. ఆ పార్టీకి కటిఫ్ చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు… ఇప్పుడు రూటు మారుస్తున్నారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉండటం అంటే.. ఓ ప్రివిలేజ్‌గా భావించే పరిస్థితికి వచ్చినట్లుగా కనిపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పుట్టిన రోజు నాడు… టీడీపీ నేతలంతా మూకుమ్మడిగా సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ పారించారు. వీరిలో అధినేత చంద్రబాబు కూడా ఉన్నారు. చంద్రబాబుకు .. అమిత్ షా.. రొటీన్‌గా ధ్యాంక్స్ చెప్పారు. అయినప్పటికీ.. మరో సారి ఆయనకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు చెప్పారని టీడీపీ వర్గాలు మీడియాకు సమాచారం ఇవ్వడంతో.. ఆశ్చర్యపోవడం అందరి వంతయింది. బీజేపీతో సంబంధాల కోసం.. చంద్రబాబు.. మళ్లీ ఆరాటపడుతున్నారని.. ఆయనే చెప్పుకున్నట్లయిందంటున్నారు.

బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నాలు..!

తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత…  వివిధ కారణాలతో.. ఆ పార్టీకి చెందిన నేతలు బీజేపీలో చేరుతున్నారు. తన ఆంతరంగిక బృందంలో సభ్యులుగా ఉన్న వారు వెళ్లి బీజేపీలో చేరిపోయారు. పలువురు టీడీపీ నేతలు కూడా.. అదే బాటలో ఉన్నారు. ఏపీలో బీజేపీ ఏదో బలం పుంజుకుంటుందని వారి భావన కాదు. కానీ రాజకీయాలకు సంబంధం లేని ఇతర కారణాల వల్ల వారికి బీజేపీ రక్షణ కావాల్సి వచ్చింది. చంద్రబాబు కూడా.. ఇలాంటి చేరికలను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా.. స్వయంగా ఆయన కూడా..  బీజేపీకి మళ్లీ దగ్గరయితే.. బాగుండన్నట్లుగా ఉంటున్నారు. కొద్ది రోజల క్రితం..” రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. భవిష్యత్తు రాజకీయాలను ముందే ఊహించడం కష్టం…” అంటూ వ్యాఖ్యానించి ఊహాగానాలకు తెరతీశారు.  ఇప్పుడు అమిత్ షాకు ఫోన్లు చేస్తూ వాటిని మరింతగా పెంచుతున్నారు.

బీజేపీపై తిరగబడి ఐదు నెలలే కదా అయింది..!?

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనధికారికంగా మద్దతు ఇచ్చిన బీజేపీ.. ఎన్నికల తర్వాత అధికార వైసీపీతో విభేదించడం మొదలు పెట్టింది. జగన్ వ్యవహారశైలి కారణంగా కేంద్ర పెద్దల్లోనూ సానుభూతి లేకుండా పోయింది.  దీన్ని ఉపయోగించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.  రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ వంటి కీలక నేతలతో చంద్రబాబు మంతనాలు, బీజేపీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి ప్రముఖంగానే ఉన్నాయి. అప్పుడే.. చంద్రబాబు బీజేపీకి అనుకూలంగా మారిపోతే.. ఇంత దానికే.. ఎన్నికలకు ముందు.. అంత సీన్ చేయడం ఎందుకనే విమర్శలు సహజంగానే వస్తాయి.

అడ్వాంటేజ్‌గా తీసుకుని విమర్శలు చేస్తున్న ఏపీ బీజేపీ నేతలు..!

ఎన్నికల ప్రచారంలోనే అమిత్ షా.. ఫలితాల తర్వాత చంద్రబాబు మళ్లీ ఎన్డీఏ వద్దకు వస్తారని.. కానీ తాము తలుపులు మూసేశామని ప్రకటించారు. దీన్ని గుర్తు పెట్టుకునే బీజేపీతో సంబంధాల కోసం టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారన్న అంచనాకు రాగానే.. బీజేపీలోని ఓ వర్గం నేతలు తమ నోరు సవరించుకుంటున్నారు. రాజకీయ విలువల్లేని టీడీపీతో బీజేపీ ఇక ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని కన్నా లక్ష్మీనారాయణ తేల్చేశారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. బీజేపీతో సంబంధాల కోసం చంద్రబాబు ఆరాటం.. బీజేపీ రాష్ట్ర నేతలకు అడ్వాంటేజ్‌గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

గ్రేటర్ హీట్ : కేసీఆర్ పొలిటికల్..మోదీ అపొలిటికల్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం తారస్థాయికి చేరింది. అవడానికి స్థానిక సంస్థ ఎన్నికే అయినా... ప్రచారంలోకి అగ్రనేతలు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రచారసభలో...

HOT NEWS

[X] Close
[X] Close