ఆంధ్రజ్యోతి ఆర్కేకి అమిత్ షా మహానుభావుడెప్పుడయ్యారు..?

సర్దార్ షా..! అమిత్ షా మీద.. సండే మ్యాగజైన్‌ కవర్ స్టోరీ వేసేసింది ఆంధ్రజ్యోతి..! .. అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతటి ధైర్య సాహసాలు చూపించిన వ్యక్తిగా కీర్తించింది. ఆ హ్యాంగోవర్.. ఆంధ్రజ్యోతి పాఠకులకు అలా ఉండగానే… కాబోయే ప్రధాని అమిత్ షా అంటూ… ఆర్టికల్స్ వేసేస్తున్నారు. ఈ వరుస ట్విస్ట్‌లేమిటో.. చాలా మందికి అర్థం కావడం లేదు… కానీ ఒక్కటి మాత్రం నిజం. అమిత్ షాను కాకా పడుతున్నారు. భవిష్యత్‌లో ఆయనే సూపర్ పవర్ అని నమ్ముతున్నారు. ఇంతలో ఇంత మార్పు ఎందుకొచ్చింది..?

అప్పట్లో అమిత్‌ షాను శకుని మామలా చిత్రీకరించిన ఆంధ్రజ్యోతి..!

ఆంధ్రజ్యోతిలో గతంలో మోడీని టార్గెట్ చేసుకుని ఎన్నో కథనాలు వచ్చాయి. మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా కనీసం ప్రచారంలోకి రాక ముందు కూడా.. మోడీపై… అత్యంత తీవ్రమైన వ్యతిరేక కథనాలు వచ్చేవి. గోద్రా ఉదంతం నేపధ్యంలో ఆ కథనాలు .. బీజేపీని టార్గెట్ చేస్తూ ఉండేవి. ఆంధ్రజ్యోతిలో ఉన్న పై స్థాయి ఎడిటోరియల్ స్టాఫ్ భావజాలానికి అవి దగ్గరగా ఉంటాయి. సహజంగా.. కొన్ని అంశాల్లో తప్ప.. మిగతా విషయాల్లో ఆర్కే జోక్యం చేసుకోరు కాబట్టి.. ఆయన మద్దతు, వ్యతిరేకత ఉన్నట్లు అనుకోలేం. పైగా.. మోడీ అప్పట్లో.. ఇలా దేశ యువనికపై.. దూసుకొస్తారని ఎవరూ ఊహించి ఉండలేరు కూడా. కానీ మోడీ.. ఎప్పుడైతే.. ప్రధాని అయ్యారో… అప్పుడే అమిత్ షా దశ కూడా తిరిగింది. కానీ ఆయనను టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం.. ఆయన పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాతే… ప్రత్యర్థులకు కలిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ బాధ్యతను.. ఆంధ్రజ్యోతి మాత్రమే తీసుకుంది. తమకు ఉన్న లగేజీ కారణంగా జగన్ మీడియా అమిత్ షాను పల్లెత్తు మాట అనలేకపోయింది. కానీ రాష్ట్ర ప్రయోజనాల పేరుతో.. ఆంధ్రజ్యోతి.. కనీసం మూడు, నాలుగేళ్ల పాటు..అమిత్ షాను ఏకి పారేసింది.

ఇప్పుడు “సర్దార్ షా” ఎలా అయ్యారు..?

ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలు నెరవేర్చకుండా.. మోసం చేసిన మొట్టమొదటి వ్యక్తిగా అమిత్ షాను గతంలో తీర్మానించేసింది ఆంధ్రజ్యోతి. ఏపీకి సంబంధించి.. ఎలాంటి నిధులు విడుదల చేయాలన్నా… ఆయన చిటీ రాసి పంపాల్సిందేనని.. ప్రకటించింది. ఏపీకి ఏమీ రాకపోవడానికి.. అమిత్ షా రాజకీయ ప్రయోజనాలు చూసుకోవడమేనని.. చెప్పుకొచ్చారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టారనే భావనను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేశారు. ఏ విషయంలో అయినా.. అమిత్ షాకు వ్యతిరేక కథనాలే కానీ.. సానుకూలంగా గత నాలుగేళ్ల కాలంలో ఒక్కటీ లేదు. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయింది. ఇప్పుడు.. వ్యతిరేకంగా ఒక్కటంటే.. ఒక్క ఆర్టికల్ ఉండదు. పైగా ఆయన ధీరుడు.. వీరుడు అని పొగుడుతూ పుస్తకాలు వేసేస్తున్నారు.

అపాయింట్‌మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రయోజనాలు గాలికొదిలేస్తారా..?

కొద్ది రోజుల క్రితం.. ఆర్కేని ఓ కేంద్రమంత్రి ఇంటికి వచ్చి కలిశారు. ఆ తర్వాత ఆర్కే ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిశారు. ఆయన ఆహ్వానం మేరకే.. వెళ్లి కలిసినట్లుగా ఆంధ్రజ్యోతి చెప్పుకుంది. అప్పట్నుంచే పరిస్థితి మారిపోయింది. తనను గుర్తించి.. పిలిచి మరీ అపాయింట్‌మెంట్ .. ఇచ్చి.. మంచిచెడ్డలు కనుక్కున్నందుకు.. ఆర్కే.. మహదానందపడిపోయినట్లున్నారు. అమిత్ షాకు వీరతాళ్లు వేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. మరి ఇంత కాలం… ఆయన రాష్ట్రానికి చేసిన ద్రోహం సంగతేమిటి..? … ఆంధ్ర ద్రోహి అని తీర్మానిస్తూ.. వేసిన ఎడిటోరియల్స్‌కు.. సమాధానం ఏమిటి..? పోనీ ఇప్పుడైనా.. ఏపీకి … అమిత్ షా .. మేలు చేస్తున్నారా…? ఆ విషయమైనా… తన పత్రికలో చెప్పవచ్చు కదా..?. చంద్రబాబు హయాంలో.. ఏపీకి రావాల్సిన నిధుల విషయంలో.. కొంచెం ఒత్తిడైనా ఉండేది.. ఇప్పుడు అదీ కూడా లేదు. ఏపీకి ఇవ్వాల్సిన వాటిపై కేంద్రాన్ని అడిగేవారు లేరు. అప్పట్లో తెగించి అడిగిన ఆంధ్రజ్యోతి కూడా.. ఇప్పుడు అమిత్ షా భజనకు ఫిక్సయిపోయింది.

రాజకీయ దాడుల నుంచి రక్షణ కోసం విలువల్ని వదిలేస్తారా..?

అక్షరమే మా ఆయుధం అని క్యాప్షన్ పెట్టుకున్న రాధాకృష్ణ… ఓ రకంగా.. అమిత్ షా శరణు కోరినట్లే. ఓ వైపు.. కేసీఆర్.. మరో వైపు జగన్.. ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నారు. తాను సమర్థించి… రాజకీయ నిర్ణయాలు కూడా.. తీసుకోవడం…ప్రభావితం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు… రాజకీయంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు. అండగా ఉంటామని చెబుతారే.. కానీ… తనకే ఓ అండ కావాల్సిన పరిస్థితికి వచ్చారు. అందుకే.. ఆర్కే చంద్రబాబుకు గుడ్ బై చెప్పి… తన అండ తాను వెదుక్కున్నట్లుగా ఉన్నారు. అమిత్ షా పంచన చేరారు. ఇది ఆంధ్రజ్యోతి ఇంత కాలం చెప్పిన విషయాలకు.. ఇప్పుడు చేస్తున్న చేతలకు.. పొంతన లేకపోవడమే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close