‘మా’ బిల్డింగ్ క‌ట్టేస్తానంటే.. అప్పుడు ఎందుకు వ‌ద్ద‌న్నారు?

`మా` బిల్డింగ్ వ్య‌వ‌హారం… ఏళ్ల త‌ర‌బ‌డి న‌లుగుతూనే ఉంది. `మా` అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రిగే ప్ర‌తీసారీ ఇదే ర‌చ్చ‌. ఇప్పుడూ అంతే. కాక‌పోతే ఇది వ‌ర‌క‌టి కంటే వాడిగా, వేడిగా చ‌ర్చ న‌డుస్తోంది. `మా` బిల్డింగ్ నేను క‌ట్టేస్తా అని మంచు విష్ణు ముందుకొచ్చాడు. అయితే ఇదంత తేలిగ్గా తెగే వ్య‌వ‌హారం కాదు. నిజానికి.. మా బిల్డింగ్ ఇది వ‌ర‌కే పూర్తి కావాల్సింది. కానీ హీరోలు చొర‌వ చూపించ‌క‌పోవ‌డంతో ఆగిపోయింది.

సీసీఎల్ గుర్తుంది క‌దా? సినీ న‌టులుంతా క‌లిసి ఆడే క్రికెట్ లీగ్. అప్ప‌ట్లో ఈ లీగ్ కి మంచి క్రేజ్ ఉండేది. సీసీఎల్ విష్ణు ఇందూరి బ్రైన్ ఛైల్డ్‌. స్టార్లంద‌రినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి క్రికెట్ ఆడించ‌డం అంటే మాట‌లు కాదు. కానీ ఏళ్ల త‌ర‌బ‌డి ఈ కార్య‌క్ర‌మాన్ని దిగ్విజ‌యంగా న‌డిపించాడు. అప్ప‌ట్లో విష్ణు ఇందూరి ఓ ప్లానింగ్ తో ఈ టోర్నీ ప్రారంభించాడు. ఓ చక్క‌టి ప్ర‌తిపాద‌న కూడా తీసుకొచ్చాడు. తెలుగులో పెద్ద స్టార్లు (మ‌హేష్‌, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, బ‌న్నీ లాంటివాళ్లంతా) సీసీఎల్ లో క‌నీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడ‌తాన‌ని ముందుకొస్తే.. `మా`బిల్డింగ్ క‌ట్టిస్తా.. అన్నార్ట‌. కానీ అప్ప‌ట్లో హీరోలెవ‌రూ మొగ్గు చూపించ‌లేదు. సీసీఎల్ అయిపోయాక‌.. విష్ణు మాట త‌ప్పుతాడ‌ని భ‌య‌మో, `మా` బిల్డింగ్ క‌డితే, ప్ర‌త్య‌క్షంగా వాళ్లెవ‌రికీ ప్ర‌యోజ‌నం లేద‌న్న ఆలోచ‌నో.. తెలీదు గానీ, అప్ప‌ట్లో ఎవ్వ‌రూ ఈ ప్ర‌తిపాద‌న‌కు అంగీక‌రించ‌లేదు. సీసీఎల్ లో తెలుగు స్టార్లు క‌నిపించినా.. అందులో బ‌డా హీరోలెవ‌రూ ఉండేవారు కాదు. స‌రిగ్గా ఇదే ప్ర‌తిపాద‌న‌… క‌న్న‌డ‌లో తీసుకెళ్తే, అక్క‌డ హీరోలంతా సై అన్నారు. అలా.. క‌న్న‌డ స్టార్స్ కి బెంగ‌ళూరులో త‌న సొంత డ‌బ్బుతో ఓ బిల్డింగ్ క‌ట్టిచ్చాడు విష్ణు ఇందూరి. నిజానికి సీసీఎల్ స‌మ‌యంలోనే హీరోలంతా ముంద‌డుగు వేస్తే.. ఇప్పుడు మా బిల్డింగ్ గురించి ఇంత రాద్ధాంతం జ‌రిగేదే కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు చేయవద్దని రేవంత్‌కు కోర్టు ఆదేశం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను వారించిన కోర్టు ఇక పై ఈడీ...

షర్మిల దీక్షను అడ్డుకున్న పోలీసులు – డబ్బులివ్వలేదని కూలీల ఆందోళన

నిరుద్యోగ ఉద్యమంలో భాగంగా ప్రతి మంగళవారం చేస్తున్న దీక్షను ఈ వారం హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ లో చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు షర్మిల అనుకున్నారు. అయితే పోలీసులు అనుమతించలేదు. ఆమె...

అచ్చెన్న, నిమ్మలకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరట !

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ ఇవ్వకూడదని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫార్సు చేసింది. త్వరలో అసెంబ్లీ వర్షాకాల...

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

HOT NEWS

[X] Close
[X] Close