మోనాల్ స్వ‌యంకృతాప‌రాధం

బిగ్ బాస్ వ్య‌వ‌హారం వింత‌గా ఉంటుంది. షోలో ఉన్నంత సేపూ.. ఆ సెల‌బ్రెటీల‌కు బోల్డంత ప్ర‌చారం, హైప్ వ‌చ్చేస్తాయి. షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చీ రాగానే వెండి తెర‌పై విజృంభించేస్తార‌నుకుంటారంతా. కానీ… బిగ్ బాస్ అవ్వ‌గానే సీన్ రివ‌ర్స్ అయిపోతుంది. బిగ్ బాస్ లో మెరిసిన‌వాళ్లెవ్వ‌రూ.. ఆ త‌ర‌వాత సినిమాల్లో రాణించ‌లేక‌పోయారు. మోనాల్ గ‌జ్జ‌ర్ ప‌రిస్థితీ అంతే. ఎన్ని సినిమాల్లో చేసినా రాని క్రేజ్‌, ఫ్రేమ్ బిగ్ బాస్ తో సంపాదించుకుంది మోనాల్. కానీ ఏం లాభం? దాన్ని క్యాష్ చేసుకోవ‌డంలో దారుణంగా విఫ‌ల‌మైంది.

బిగ్ బాస్ నుంచి రాగానే… `అల్లుడు అదుర్స్‌`లో ఓ పాట చేసింది. ఈ పాట‌కు గానూ.. ఏకంగా రూ.15 లక్ష‌లు వ‌సూలు చేసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్‌. దాంతో పాటు.. మోనాల్ కి కూడా అవ‌కాశాలు రాలేదు. చిన్న చిన్న ఆఫ‌ర్లు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లాంటివి.. మోనాల్ కి ద‌క్కాయి. కానీ… భారీ పారితోషికాలు డిమాండ్ చేసి, త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వాళ్ల‌ని బెద‌ర‌గొట్టేసింది మోనాల్. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి ఏకంగా రూ.10 ల‌క్ష‌లు డిమాండ్ చేసింద‌ట‌. స్టార్ హీరోయిన్ల‌కే అంత ఇవ్వ‌డం లేదు. అలాంటిది మోనాల్ కి ఎందుకిస్తారు? అందుకే వ‌చ్చిన‌వాళ్లు వ‌చ్చిన‌ట్టే వెన‌క్కి వెళ్లిపోయారు. ఓ సినిమాలో ఆఫ‌ర్ వ‌స్తే.. `ఓకే` అనేసి, తీరా ఎగ్రిమెంట్లు పూర్త‌య్యాక‌,.. `నా పారితోషికం పెంచాలి` అని గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్ట‌డంతో స‌ద‌రు నిర్మాత వెన‌క్కి వెళ్లిపోయాడు. అలా చేతులారా కొన్ని అవ‌కాశాల్ని జార‌విడచుకుంది. అయితే ఎట్ట‌కేల‌కు మోనాల్ కి ఓ బంప‌ర్ ఛాన్స్ ద‌క్కింది. నాగార్జున `బంగార్రాజు`లో మోనాల్ కి ఓ అవ‌కాశం ద‌క్కింది. ఈ సినిమాలో మోనాల్ ఓ పాట‌లో క‌నువిందు చేయ‌బోతోంద‌ని స‌మాచారం. `సోగ్గాడే చిన్ని నాయిన‌`లో అన‌సూయ ఓ పాట‌లో మెరిసింది క‌దా. అలాంటి హుషారైన పాట‌లో మోనాల్ కనిపించే ఛాన్సుంది. ఈసారి మాత్రం మోనాల్ పారితోషికం విష‌యంలో పేచీ పెట్ట‌లేద‌ట‌. ఎందుకంటే ఇది నాగ్ సినిమా. పైగా… రాక రాక వ‌చ్చిన ఛాన్స్‌. కాబ‌ట్టి.. రాగానే ఒప్పేసుకుంది. ఈ పాట‌లో అయినా మోనాల్ త‌నని తాను నిరూపించుకుంటే.. ఇంకొన్నాళ్లు తెర‌పై క‌నిపిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close