ప్ర‌భాస్ సినిమాలో…. మ‌రో ఇద్ద‌రు హీరోలు?

ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ప్రాజెక్ట్ కె`. వైజ‌యంతీ మూవీస్ ఈ చిత్రాన్ని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోంది. సుమారు రూ.400 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఇది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, దీపికా ప‌దుకొణెలు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌రో క‌థానాయిక‌కీ స్థానం ఉంద‌ని, అయితే ఆమెది డీ గ్లామ‌ర్ పాత్ర అని, ఆ పాత్ర‌లో స‌మంత క‌నిపించే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.

ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో మ‌రో ఇద్ద‌రు హీరోలూ ఉంటార్ట‌. అయితే వాళ్ల‌వి రెండే రెండు సీన్లున్న పాత్ర‌ల‌ని, కాక‌పోతే… అమితాబ్ బ‌చ్చ‌న్ కాంబినేష‌న్ లో ఆ సీన్లు వ‌స్తాయ‌ని స‌మాచారం. కాబ‌ట్టి… ఆ రెండు పాత్ర‌ల‌కూ పేరున్న హీరోల‌నే తీసుకోవాల‌ని నాగ అశ్విన్ అనుకుంటున్నాడు. అమితాబ్ తో సీన్ కాబ‌ట్టే… ఆయా పాత్ర‌ల‌కు ఎవ‌రిని అడిగినా ఓకే అంటారు. నాగ అశ్విన్ తో ఇది వ‌ర‌కు సినిమాలు చేసిన నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి వాళ్లని ఈ పాత్ర‌లకు ప‌రిగ‌ణ‌లోనికి తీసుకునే అవ‌కాశం ఉంది. పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి, వేరే భాష‌ల నుంచి ఇద్ద‌రు పేరున్న హీరోలు క‌నిపించినా ఆశ్చ‌ర్యం లేదు. ఎలాగైనా స‌రే, ఈ సినిమాలో ప్ర‌భాస్ తో పాటుగా మ‌రో ఇద్ద‌రు హీరోలు క‌నిపించ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు చేయవద్దని రేవంత్‌కు కోర్టు ఆదేశం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను వారించిన కోర్టు ఇక పై ఈడీ...

షర్మిల దీక్షను అడ్డుకున్న పోలీసులు – డబ్బులివ్వలేదని కూలీల ఆందోళన

నిరుద్యోగ ఉద్యమంలో భాగంగా ప్రతి మంగళవారం చేస్తున్న దీక్షను ఈ వారం హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ లో చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు షర్మిల అనుకున్నారు. అయితే పోలీసులు అనుమతించలేదు. ఆమె...

అచ్చెన్న, నిమ్మలకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరట !

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ ఇవ్వకూడదని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫార్సు చేసింది. త్వరలో అసెంబ్లీ వర్షాకాల...

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

HOT NEWS

[X] Close
[X] Close