‘జన్‌ ఆందోళన్‌”కు ఈసీ ఎందుకు సమాధానం ఇవ్వదు..!

ఇప్పుడు అంతా భారతీయ జనతాపార్టీ దూకుడు గురించే చర్చించుకుంటున్నారు. తిరుగులేని అధికారం అందిన ఉత్సాహంలో.. ఇతర పార్టీలను నిర్వీర్యం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. వాటి సంగతి సరే.. అసలు ఎన్నికల ప్రక్రియపై.. వస్తున్న సందేహాలను మాత్రం.. ఎవరూ పట్టించుకోవడం లేదు. నిజానికి ఎన్నికల ప్రక్రియపైనే అనుమానం కలిగేలా…. ఆ సందేహాలున్నాయి. కొన్ని సంస్థలు మాత్రం తమ పట్టు వదలకుండా.. సందేహాల నివృతి కోసం ప్రయత్నిస్తున్నాయి. వాటిలో ఒకటి జన్ ఆందోళన్.

ఎన్నో అనుమానాలు.. ఈసీ ఒక్కదానిపైనా నోరు మెదపదేంటి..?

పోలయిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లను లెక్కించారు..!
ఈవీఎంలో ఓట్లకు.. వీవీ ప్యాట్ల లెక్కలకు తేడా..!
372 నియోజకవర్గాల్లో అవకతవకలు గుర్తింపు..!
ఇలా చెప్పుకుటూ పోతే.. ఈవీఎంల మీద.. ఎన్నో అనుమానాలు, ఆరోపణలు.. ప్రజల్లో ఉన్నాయి. కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి కూడా. ఇటీవల ఎన్నికల్లో కూడా దాదాపు 372 స్థానాల్లో పోలైన ఓట్ల కంటే, రికార్డయిన ఓట్లు అధికంగా నమోదయ్యాయి. దాంతోపాటు నిబంధనల ప్రకారం ఓటేసే సమయంలో నిబంధనల ప్రకారం వివిప్యాట్‌ ఏడు సెకన్ల పాటు కనిపించాలని, కానీ చాలా ప్రాంతాల్లో మూడు సెకన్లే కనిపించింది. అంటే రీ ప్రోగ్రామింగ్ చేశారు ఇవిఎంలలో ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్లేంటన్నది ఎవరికీ తెలియదు. ఎన్ని అనుమానాలొచ్చినా ఈసీ మాత్రం సైలెంట్‌గా ఉంటోంది.

ఈవీఎం చిప్‌లపై కంగారు పడుతున్న ఈసీ.. !

ఇవిఎంలలో ప్రొగ్రామింగ్‌ చేసే చిప్‌నకు సంబంధించిన అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం అడ్డదిడ్డమైన సమాధానాలిస్తూ… కంగారు పడుతోంది. ఈవీఎం చిప్‌ కేవలం ఒకేసారి ఉపయోగించబడేది అని ఎన్నికల సంఘం గతంలో స్పష్టం చేసిది. అయితే ఆ చిప్‌ను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నామని… ఇటీవల ఒక సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిది. దీనిపై గందరగోళం రేగుతోంది. ఈ గందరగోళంపై ఇసి ఇప్పటి వరకూ ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. పైగా ఇవిఎంలు, దానికి అవసరమైన చిప్‌లను రూపొందించే కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్‌ఈఎల్‌, ఆ చిప్‌ బహుళ వినియోగ సాధనమని స్వయంగా ధృవీకరించింది.

ఊపందుకుంటున్న “జన్ ఆందోళన్” ఉద్యమం.. !

“జన్ ఆందోళన్” సంస్థ.. వివిధ మార్గాల్లో ఎన్నికల అవకతవకలను గుర్తించి.. మెల్లగా ఉద్యమం ప్రారంభిస్తోంది. ఆ సంస్థ సేకరిస్తున్న అంశాల్లో… బలం ఉండటంతో.. పలువురు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ.. జన్ ఆందోళన్‌కు మద్దతు పలుకుతున్నారు. గతంలో చిప్‌పై ఉన్నటువంటి అల్యూమినియం కోటింగ్‌పై ఇసి ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక బయటపెడితే చాలా విషయాలు తెలుస్తాయన్న అభిప్రాయంఉంది. అలాగే గోడౌన్లలో ఉన్న ఈవిఎంలకు సంబంధించి గతంలో ఈసి వేసిన విచారణ కమిటీ కూడా బయట పెట్టాలంటున్నారు.

ఈసీ తీరుతో మరిన్ని అనుమానాలు..!

ఎన్నికల సంఘం… భారతీయ జనతా పార్టీ గెలుపులో.. కీలకంగా వ్యవహరించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుందని… సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయంటేనే.. ఆ రాజ్యాంగబద్ధ సంస్థ పని తీరు ఎంత నాసిరకంగా ఉందో.. అర్థమైపోతుంది. ఎన్నికల ప్రక్రియపై నమ్మకం పెంచాల్సిన ఈసీ అనుమానం పెంచుతోంది. తన రహస్య చర్చల వల్ల… ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. దీని వల్లే.. అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి జన్ ఆందోళన్ ఉద్యమం.. జన ఆందోళనగా మారే వరకూ.. ఇలాగేఉంటారా..? వివరాలు బయటపెడతారా.. అన్నదానిపై ఈసీ స్పందించాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close