సుభాష్ : పవన్‌ను చూసి ఇంతగా వణికిపోతున్నారేంటి!?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన హాట్ టాపిక్ గా మారింది. పవన్ ఎప్పుడైతే ఓట్లు చీలనివ్వబోము అన్నాడో అప్పట్నుంచి వైసీపీ నేతలకు పూనకం వచ్చేసింది. పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిట్టడమే .. దమ్ము, ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చెయ్ అంటున్నారు. అదే దమ్ము, ధైర్యం ఉంటే.. రాజధానిపై మాట తప్పినప్పుడు.. ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం తీసుకోవాలని సవాల్ చేసినప్పుడు ఈ వైసీపీ నేతలెందుకు స్పందించలేదో కానీ.. పవన్ రాజకీయ అడుగుల్ని మాత్రం.. ఇలా బూతులు తిట్టి తామే నిర్దేశించాలనుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ ఏం చేయాలో వైసీపీ నేతలు చెబుతారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఏం చేయాలో , ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో… ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాలన్నట్లుగా పరిస్థితి మారింది. పవన్ కల్యాణ్ .. రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక తానేం చేయాలో జగన్మోహన్ రెడ్డిని పవన్ కల్యాణ్ అడిగి చేయాలన్నట్లుగా వ్యవహారం ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా పోటీ చేస్తే.. అదిగో… చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం లేదు.. అధికార వ్యతిరేక ఓట్లు చీల్చి టీడీపీకి మేలు చేయాలనుకుంటున్నారని విమర్శలు చేస్తారు. పొత్తులు పెట్టుకుంటే… అదిగో ముందు నుంచే చెబుతున్నాం.. వారిద్దరూ ఒకటే అని ఆరోపిస్తారు. ఏం చేసినా ఏదో ఒకటి విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రెండో పద్దతిలో ఓట్లు చీలనివ్వబోమన్నందుకు దాడి చేస్తున్నారు.

పవన్ ఏం చేసినా చంద్రబాబు చెబితేనే చేశారంటారా ?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ.. జనసేనలో చేరారు. చంద్రబాబే చేర్చారన్నారు. జనసేన పార్టీ.. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. రాజకీయంగా ఇది మంచి ఎత్తుగడే. అయితే.. తమ దళిత ఓటు బ్యాంక్‌ను చీల్చడానికి చంద్రబాబు వ్యూహం ప్రకారం… పవన్ కల్యాణ్.. మాయావతితో పొత్తు పెట్టుకున్నారని.. వైసీపీ ఆరోపించింది. మరి జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో… వైసీపీ చెబుతుందా..?. ఏ రాజకీయ పార్టీ విధానం ఆ పార్టీది. వైసీపీ.. నేరుగా పొత్తులు పెట్టుకోకపోవచ్చు కానీ.. దొడ్డి దోవన బీజేపీతో అవగాహనకు వచ్చిందని.. అప్పట్లో స్టింగ్ ఆపరేషన్లు కూడా బయటపెట్టాయి. జనసేనకు.. తన రాజకీయ వ్యూహాలను అనుసరించే హక్కు ఉంది. కానీ దాన్ని చంద్రబాబు పేరు చెప్పి వైసీపీ ఆక్రమించాలని చూస్తోంది.

పవన్ కు రాజకీయ నిర్ణయాలు తీసుకునే హక్కు లేదా..?

రాజకీయాల్లో ఎవరితో ఎవరు అయినా పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు తోడు.. చివరికి పవన్ కల్యాణ్.. చంద్రబాబుతోనే కలుస్తారని వైసీపీ నేతలు విమర్శించేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఏం చేసినా.. వైసీపీ విమర్శిస్తోంది. కానీ.. జనసేనకు.. తన రాజకీయ నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఉంది. వ్యూహాలను అమలు చేసుకునే హక్కు ఉంది. దాన్ని తమ పరం చేసుకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారు. ఎందుకంటే..జనసేన అంత కీలకం కాబట్టి .

వ్యతిరేకతకు తోడు ఓట్లు ఏకమైతే.. జగన్‌కు పరాభవమే !

ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. పరిపాలన అనేదే లేదని ప్రజలకు అర్థమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీలన్నీ ఏకమైతే.. వైసీపీకి పరాభవం ఎదురవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ విషయం వైసీసీ నేతలకు తెలియనిదేం కాదు. అందుకే.. వైసీపీ నేతలు లేనిపోని రాజకీయాలతో బూతులు తిట్టి అయినా.. తమ వ్యూహం ప్రకారం పవన్ ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ రాజకీయాలు అందరికీ తెలుసని పవన్ నిరూపించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close