పరకామణి కేసులోనూ దొరికిపోతానని జగన్ రెడ్డి భయపడుతున్నట్లుగా ఉన్నారు. ఆ కేసును బయటకు తీయడం, విచారించడం తప్పన్నట్లుగా ఆయన మాట్లాడటం సంచలనంగా మారుతోంది. గురువారం బెంగళూరుకు పోయే ముందు ప్రెస్మీట్ పెట్టడం జగన్ రెడ్డి టైంటేబుల్ లో భాగంగా మారింది. ఆ ప్రకారం ఆయన ఇవాళ ప్రెస్మీట్ పెట్టి .. ఎప్పట్లాగే ఆవుకథ వినిపించారు. కానీ అందులోనూ ఆయన తాజా డెలవప్మెంట్స్ తో ఆందోళనకు గురవుతున్నట్లుగా కనిపిస్తోంది. పరకామణి కేసును విచారించడం కూడా తప్పని అంటున్నారు.
పరకామణి చోరీలో ఆ రవికుమార్ కేవలం 9 డాలర్లే దొంగతనం చేస్తూ దొరికాడట.. కానీ ప్రాయశ్చిత్తంగా రూ. 14 కోట్ల ఆస్తులు టీటీడీకి ఇచ్చారట. అందుకే కేసును రాజీ చేశారట. మళ్లీ విచారణ చేయడం ఎందుకని జగన్ రెడ్డి ప్రశ్న?. జగన్ రెడ్డి అమాయకుడా.. లేకపోతే ఆయన మాటలు వినేవాళ్లు అమాయకులు అనుకుంటారా?. ఓ చిన్న క్లర్క్ దొంగతనం చేస్తే రూ. 14కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చాడు?. అంటే ఆ దొంగతనం బహురూపాల్లో చాలా కాలంగా జరుగుతోందని.. అలానే ఆ ఆస్తులు సంపాదించాడని అర్థం కాదా?. సరే ఇదంతా పక్కన పెడదాం.. అసలేం జరిగిందో దర్యాప్తు చేస్తే తప్పేంటి?
రవికుమార్ దగ్గర వంద కోట్ల రూపాయల విలువైన ఆస్తులను వైసీపీ నేతలు రాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ చిన్న క్లర్క్ కు టీటీడీకి ఇచ్చింది కాకుండా.. ఇంకా వందల కోట్ల ఆస్తులెక్కడి నుంచి వచ్చాయి?. అసలు ఎంత దొంగతనం చేశారు.. ఎలా చేశారు.. ఎవరెవరు సహకరించారు.. ఇవన్నీ తెలియవద్దా?. జగన్ రెడ్డి ఈ కేసు దర్యాప్తుపై వ్యతిరేకత చూపుతున్నారంటే.. కీలక ఫిర్యాదుదారుగా ఉన్న సతీష్ మరణంపై ఇంకా అనేకానేక సందేహాలు రావడం సహజమే కదా.
ఏ కేసు విచారణ జరిగినా.. జగన్ రెడ్డి భుజాలు తడుముకోవడం కామన్ అయిపోయింది. ఇప్పటికే ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు నివేదిక కోర్టుకు చేరింది. ఈ ప్రెస్మీట్ లో జగన్ రెడ్డి.. ఎప్పటిలా.. తాను అనుకున్నది మాత్రమే నిజమని.. ప్రజలంతా కష్టాల్లోఉన్నారని ఫీలవుతూ.. ప్రసంగించారు. పునర్దర్శనం వచ్చే మంగళవారం ..కావొచ్చు.
