భోగాపురానికి ఎయిర్ పోర్టు ఎందుకు..అక్కడికి ఎర్రబస్సు కూడా పోదు.. ఎయిర్ బస్సెందుకు.. ఎయిర్ పోర్టుకు రెండున్నర వేల ఎకరాలు ఎందుకు.. ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఎయిర్ పోర్టుకు ఏం ఆదాయం వస్తుంది అని .. అప్పట్లో భోగాపురం కబుర్లు చెప్పి ఎయిర్ పోర్టుకు అడ్డం పడే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు.
అమరావతికి అన్ని భూములెందుకు.. ఇన్ని భూములెందుకు.. లక్ష కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు..మరో లక్ష కోట్లు ఎందుకు అంటూ తనకు మాత్రమే సాధ్యమైన భాషలో జాతీయ మీడియా చానల్స్ ప్రతినిధుల్ని పిలిపించుకుని మాట్లాడారు. ఆయన మాటలు వారికి ఏమైనా అర్థమయ్యాయో లేదో కానీ అమరావతిపై అసలు జగన్కు మాట్లాడే హక్కు ఉందా అని ఏపీ ప్రజలు మాత్రం అనుకుంటారు.
అమరావతికి రెండు లక్షల కోట్లు కావాలని జగన్ తాజాగా లెక్కలు చెప్పారు. మొదట 50వేల ఎకరాలకు లక్ష కోట్లు కావాలట.. తర్వాత యాభై వేల ఎకరాలకు మరో లక్ష కోట్లు కావాలట..ఈ లెక్కలన్నీ ఎవరు చెప్పారంటే.. ఆయనకే తెలియదు. ప్రభుత్వ డీపీఆర్ అంటారు. ప్రభుత్వ డీపీఆర్ ప్రకారం అది సస్టెయినబుల్ ప్రాజెక్ట్ . రుణాలు తీసుకుని కట్టినా మొత్తం అమరావతి తీర్చేసుకుంటుంది. అదనంగా ప్రభుత్వానికి ఆదాయం, ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ఇది జగన్ కు అర్థం కాదు.
అమరావతిపై హత్యాయత్నం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. అమరావతి రైతుల్ని అత్యంత ఘోరంగా వేధించిన వ్యక్తి జగన్ రెడ్డి. వారికి న్యాయం జరగడం లేదని ఆయన మాట్లాడటం అంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. అమరావతిని నిర్వీర్యం చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైతే..కనీసం కౌలు కూడా చెల్లించలేదు. ఆయన ఇప్పుడు అమరావతి రైతులుకు న్యాయం గురించి మాట్లాడుతున్నారు. రెండో విడత భూసమీకరణ ఎక్కడ విజయవంతం అవుతుందో అని ఆయన కంగారు పడుతున్నట్లుగా ఉన్నారు. జగన్ రెడ్డిని నమ్మి ఒక్క ఎకరా భూమి ఇచ్చేవాళ్లు ఉండరు. కానీ ఈ ప్రభుత్వానికి వేల ఎకరాలు ఇస్తూంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు.
జగన్ రెడ్డికి అమరావతి అంటే నిలువెల్లా వ్యతిరేకతే. ఆంధ్రులకు రాజధాని ఉండకూడదు. ప్రజలంతా నిరుపేదలుగా ఉండి.. తాను ఇచ్చే రేషన్ బియ్యం తిని బతకాలనే ప్లాన్ తో ఐదేళ్లు పాలన చేశారు. ఆయన పాలన తీరును గుర్తించి ప్రజలకు ఆయనకు అదే గతి పట్టించారు. ఇప్పుడు కూడా మారకుండా.. కుట్రలు కొనసాగిస్తూంటే.. ప్రజలు కూడా తమకు చేతనైనంత రీతిలో బుద్ది చెబుతారు. కొన్నాళ్లు పోతే ఇప్పుడు బోగాపురం క్రెడిట్ తనకే అని ఎలా చెబుతున్నారో.. అమరావతి క్రెడిట్ కూడా తనదే అని చెప్పుకున్నా ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే ఆ మనిషికి వెన్నుముక అనేదే ఉండదు.
