అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంతో ఏపీలో పండుగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ హయాంలో రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి నెలకొనగా.. కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతే మా రాజధాని అని కాలర్ ఎగరేసుకొని చెప్పేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మాణం అవుతోంది. ప్రధాని ప్రారంభించనున్న పునర్ నిర్మాణ పనులతో జనమంతా జోష్ లో ఉండగా.. జగన్ మాత్రం సైలెంట్ గా బెంగళూరుకు వెళ్లడంపై ఆయన మానసిక పరిస్థితిపై మారోసారి చర్చ జరుగుతోంది.
వైసీపీ అధికారంలో కోల్పోయాక జగన్ పరిస్థితిలో చాలా మార్పు కనిపిస్తోంది. నలుగురు సంతోషంగా ఉన్నవారి దగ్గరికి వెళ్లేందుకుగాని, వారితో కలిసి సంతోషాన్ని పంచుకునేందుకు అస్సలు ఆసక్తి చూపడం లేదు. ఎక్కడ శవం లేస్తే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. పోనీ బాధిత కుటుంబాలకు భరోసా అయినా కల్పిస్తున్నారా అంటే…శవ రాజకీయం చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శవం ముందు రాజకీయాల ప్రస్తావన తీసుకొచ్చి ట్రోల్ అవుతున్నారు.
జనం కోరిన రాజధాని అమరావతి నిర్మాణం కోసం కీలక ముందడుగు పడుతోన్న వేళ జగన్ ను కూటమి ప్రభుత్వం ఆహ్వానించింది. ఐదేళ్లు రాజధాని రైతులు ఇబ్బంది పెట్టి ఇప్పుడు వెళ్లడం బాగుండదని అనుకున్నారో ఏమో జగన్ సైలెంట్ గా బెంగళూరు జారుకున్నారు. ఏపీలో ఇంత పెద్ద స్థాయిలో సంబురం నెలకున్న వేళ ఆయన బెంగళూరు వెళ్లడం జగన్ మానసిక పరిస్థితికి అద్దం పడుతోందని మండిపడుతున్నారు.