కేసీఆర్ హాజరు వెనక రహస్యం అదేనంటున్న ‘నమస్తే తెలంగాణ’

హైదరాబాద్: చంద్రబాబునాయుడు అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించినప్పటికీ కేసీఆర్‌ ఆ కార్యక్రమానికి హాజరవుతారా, లేదా అనే విషయంపై ఒకవారం క్రితందాకా పెద్ద సస్పెన్స్ నెలకొనిఉన్న సంగతి తెలిసిందే. శంకుస్థాపనకు ఒక్కరోజు ముందు ఆ సస్పెన్స్‌కు కేసీఆర్ తెరదించి తాను కార్యక్రమానికి హాజరవుతున్నట్లు మీడియాకు వెల్లడించారు. ఆయన ఆ కార్యక్రమానికి హాజరవటంపై రకరకాల విశ్లేషణలు, వాదనలు వినిపించాయి. ఓటుకునోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల దృష్ట్యా ఇరువురు చంద్రులూ రాజీపడ్డారని కొందరు, జీహెచ్ఎమ్‌సీ ఎన్నికల దృష్ట్యా సెటిలర్లను ఆకట్టుకోవటంకోసమే హాజరవుతున్నారని మరికొందరు విశ్లేషించారు. అయితే టీఆర్ఎస్ పార్టీ పత్రిక ‘నమస్తే తెలంగాణ’ వీటికి భిన్నంగా మరొక వాదనను తెరపైకి తీసుకొచ్చింది.

‘నమస్తే తెలంగాణ’ సంపాదకుడు కట్టా శేఖరరెడ్డి అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ‘కట్టా-మీఠా’ అనే తన కాలమ్‌లో విశ్లేషించారు. శంకుస్థాపన కార్యక్రమం పూర్తికాగానే – ఆంధ్రా మీడియా, వివిధ పార్టీలు అందరూ కలిసి కేంద్రంమీద, ప్రధాని నరేంద్ర మోడిమీద విరుచుకుపడటం ప్రారంభించారని, ఇది సమర్థనీయం కాదని కట్టా పేర్కొన్నారు. దీనివలన ఏపీ ప్రజలలో భవిష్యత్తుపై మరింత భయాందోళనలను రేపుతున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఏమేమి కావాలనేది చంద్రబాబు, జగన్, రఘువీరా ఒకే వేదికపై కేంద్రాన్ని అడిగుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.

ఇక కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరవటంగురించి కట్టా తనదైన శైలిలో విశ్లేషించారు. కేసీఆర్‌తో పేచీలు పెట్టుకుని రచ్చ చేసినంత మాత్రాన తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ లేకపోవటం, ఓటుకు నోటు కేసు తన ధైర్యాన్ని దెబ్చతీయటం వంటి కారణాల వలన చంద్రబాబు కేసీఆర్‌తో సుహృద్భావంకోసం ముందడుగు వేశారని కట్టా పేర్కొన్నారు. ఇక కేసీఆర్‌ కార్యక్రమానికి హాజరు కావాలా, వద్దా అనే చర్చ జరిగిందని, అభిప్రాయ సేకరణ జరిపితే, ఏపీలో ఆయనపై పలువర్గాలు ఆరాధనా భావంతో ఉన్నాయని తెలిసిందని కట్టా రాశారు. కేసీఆర్ ముందుగా ఫిట్‌మెంట్ ఇచ్చి ఉండకపోతే చంద్రబాబు తమకు అంత ఇచ్చి ఉండేవారుకాదని ఆర్టీసీ కార్మికులు, విభజన జరగకపోతే ఇక్కడ ఏర్పాటవుతున్న కేంద్ర సంస్థలు, వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి, హడావుడి ఉండేది కావని ఏపీ ప్రజలు అభిప్రాయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్‌కు అమరావతిలో లభించిన స్వాగత సత్కారాలు, ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నపుడు వ్యక్తమయిన హర్షధ్వానాలు ఆ వాదనను నిజమని రుజువు చేశాయని కట్టా వ్యాఖ్యానించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close