కమ్యూనిస్టులు ప్రజలకు ఎందుకు దూరమవుతున్నారో ఒక్క సారి కూడా ఎప్పుడూ సమీక్షించుకుని ఉండరు. తాము చేసేదే రాజకీయం.. ప్రజలు తమ వెంట ఉండాలని అనుకుంటారు..కానీ కాస్త వాస్తవ పరిస్థితిని మాత్రం అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. దానికి సాక్ష్యం.. వెనిజులా సమస్యపై ఇక్కడ గల్లీల్లో ప్రదర్శనలు నిర్వహించడం.
వెనిజులా అధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేసిందని.. ఇది దురహంకారం అని ఖండిస్తూ.. కమ్యూనిస్టులు పలు చోట్ల నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వీరి తీరు చూసి రోడ్డున పోయేవారు.. అసలు వెనిజులా ఎక్కడుందో.. ఆ దేశంలో ఏదో సమస్య వస్తే ఇక్కడెందుకు నిరసనలు అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయినా వారు మాత్రం అమెరికా నశించాలి.. మదురో జిందాబాద్ వంటి నినాదాలతో తమ ర్యాలీలు చేసేస్తున్నారు.
ప్రజలకు అంతర్జాతీయ అంశాలు ఎప్పుడూ వార్తలు మాత్రమే. వాటిని చదవడమో..చూడటమో చేసి.. ఓ అలా జరిగిందా అనుకుంటారు. అంతే కానీ ఇక్కడే ఏదో నిరసనలు చేస్తే అక్కడ ఏదో జరిగిపోతుందని అనుకోరు. కానీ కమ్యూనిస్టులు మాత్రం తమ పాలసీల ప్రకారం తాము చేయాలనుకుంటారు. నిరసనలు చేసేస్తారు. ప్రజలు .. వీళ్లదో లోకం ఎప్పటికీ మారరు అనుకుని .. పట్టించుకోవడం మానేస్తున్నారు. అందుకే.. కమ్యూనిస్టులు రాను రాను.. బలహీనం అయిపోతున్నారు. ఉనికి ఉందా లేదా అన్న పరిస్థితికి వెళ్లిపోతున్నారు. అయినా మారే ప్రయత్నం చేయడం లేదు.
