” ఉగ్రవాద శిబిరాలనే టార్గెట్ చేశాం, పాకిస్తాన్ ఆర్మీ, పౌరులను టార్గెట్ చేయలేదు. ఒక వేళ పాకిస్తాన్ సైన్యం ఓ అడుగు ముందుకు వేస్తే రెడీగా ఉన్నాం ” అని.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ..ప్రెస్ బ్రీఫింగ్లో చాలా ధృడమైన, హెచ్చరికతో కూడిన స్వరంతో చెప్పారు. వ్యోమిక సింగ్ ప్రెస్ మీట్‌ను పాకిస్తాన్ లో చూడాల్సిన వారంతా చూసి ఉంటారు. ఈ ఆఫీసర్ హెచ్చరిక ఖచ్చితంగా వారిలో ఓ రకమైన భయాన్ని సృష్టించి ఉంటుంది. ఎందుకంటే.. అప్పటికే వారికి రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ చేసిన విధ్వంసం గురించి స్పష్టత ఉంది.
ప్రెస్ బ్రీఫింగ్లో వ్యోమిక సింగ్ మాత్రమే కాదు.. సోఫియా ఖురేషి కూడా పాల్గొన్నారు. పక్కా ఇంటిలిజెన్స్ సమాచారం తో 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి వాటిపై దాడి చేసామని ఎక్కడా పాకిస్తాన్ సైన్యంపై దాడి చేయలేదని తెలిపారు. క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని అంతం చేయడమే లక్షమని ప్రకటించారు. ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్లు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ కావడంతో దేశం మొత్తం భారత సైన్యం పరాక్రమాన్ని అభినందిస్తోంది. ఉగ్రశిబిరాలపై దాడులు చేసిన బృందాలకు నేతృత్వం వీరిద్దరూ ఇప్పుడు పాకిస్తాన్ కు అపర కాళికలు అనుకోవచ్చు.
వ్యోమిక సింగ్, సోఫియా ఖురేషి ఇద్దరూ అపార అనుభవం ఉన్న ఆఫీసర్లు. ఎన్నో ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. పహల్గాంలో జరిగిన దాడి తర్వాత పాకిస్తాన్ కు బుద్ది చెప్పడంతో పాటు ఓ స్పష్టమైన సంకేతాన్ని పంపాలని అనుకున్నారు. ఆ ప్రకారం.. అత్యంత కఠినమైన ఆపరేషన్ కు.. వీరిద్దర్నీ ఎంపిక చేసుకున్నారు. తమ టీమ్‌తో వీరు ఉగ్రవాదుల అంతు చూశారు. పహల్గాంలో చేసిన దాడిలో భార్యల సింధూరాలను తొలగించాలన్నట్లుగా ఉగ్రవాదులు వ్యవహరించారు. ఆ పేరుతో సిందూర్ అని పేరు పెట్టి పాకిస్తాన్ సంగతి చూశారు.
భారత సేనల సామర్థ్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. పాకిస్తాన్ కనీం గట్టిగా దాడులు చేసే పరిస్థితుల్లో కూడా లేదు. ఆ దేశానికి మహిళా సైనిక శక్తి కూడా లేదు.