ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌… లైవ్ పెర్‌ఫార్మ్సెన్స్ ఎందుకు ఇవ్వ‌లేదు?

నాటునాటు పాట‌కు ఆస్కార్ వ‌చ్చింది. ఈ పాట‌ని లైవ్ లో.. పాడి కాల‌భైర‌వ‌, రాహుల్ సిప్లిగంజ్ అరుదైన అవ‌కాశాన్ని అందిపుచ్చుకొన్నారు. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు కూడా వేదిక‌పై డాన్స్ చేస్తే చూడాల‌ని ఫ్యాన్స్ ఆశ ప‌డ్డారు. కానీ.. అది జ‌ర‌గ‌లేదు. దీనిపై భిన్న‌మైన స‌మాధానాలు వ‌చ్చాయి. `స్టేజీపై డాన్స్ చేసే అవ‌కాశం వ‌చ్చింది.కానీ.. ప్రాక్టీస్‌కి త‌గిన స‌మ‌యం దొర‌క‌లేదు. అందుకే డాన్స్ చేయ‌డం లేదు` అని ఎన్టీఆర్ ఓ సంద‌ర్భంలో చెప్పాడు. చ‌ర‌ణ్ మాత్రం త‌మ‌కు ఆహ్వానం అంద‌లేద‌న్నారు. దాంతో.. ఫ్యాన్స్ క‌న్‌ఫ్యూజ్ అయ్యారు. ఆస్కార్ క‌మిటీ… లైవ్ పెర్‌ఫార్మ్ చేసే అవ‌కాశం ఇచ్చానా.. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు ఒప్పుకోలేదా? అంటూ అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఇప్పుడు అదే నిజ‌మైంది. ఆస్కార్ వేదిక‌పై నాటు నాటు పాట‌కు లైవ్ పెర్‌ఫార్మ్ ఇవ్వ‌డానికి ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌ను ఆహ్వానించామ‌ని, అయితే… దానికి వారిద్ద‌రూ ఒప్పుకోలేద‌ని ఆస్కార్ క‌మిటీలోని కీల‌క స‌భ్యుడు వెల్ల‌డించారు.

ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలో.. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌కు ఆస్కార్ క‌మిటీ నుంచి పిలుపు అందింద‌ని, పాట‌కు లైవ్‌లో డాన్స్ చేయ‌గ‌ల‌రో, లేదో వాక‌బు చేసింద‌ని తెలుస్తోంది. మామూలుగా అయితే ఓ పాట‌కు 15 రోజుల ప్రిప‌రేష‌న్ చాలు. కానీ.. నాటు నాటు మామూలు పాటు కాదు. ఆ పాటంతా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు ఓ సింక్‌లో డాన్స్ చేస్తారు. చాలా క్లిష్ట‌త‌ర‌మైన స్టెప్పులున్నాయి. సెట్లోనే.. ఒక్కో స్టెప్పుకీ టేకుల మీద టేకులు తీసుకొన్నారు. ఈ పాట తెర‌కెక్కించ‌డానికి దాదాపుగా 17 రోజుల స‌మ‌యం ప‌ట్టింది. ఇలాంటి పాట‌ని లైవ్ లో చేయ‌డం చాలా క‌ష్టం. ఏమాత్రం సింక్ త‌ప్పినా… అభాసుపాల‌వుతారు. అందుకే ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు ఆ రిస్క్ తీసుకోలేదేమో అనిపిస్తోంది. ఓ పాట‌కు లైవ్‌లో డాన్స్ చేసిన అనుభ‌వం ఎన్టీఆర్‌. చ‌ర‌ణ్‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కూ లేదు. పైగా ఆస్కార్ అనేది మామూలు వేదిక కాదు. అకాడ‌మీ సైతం ఈ రిహార్స‌ల్స్ ని ప‌రీశీలిస్తుంది. వాటి ప్రోటో కాల్స్ వేరుగా ఉంటాయి. అందుకే హీరోలిద్ద‌రూ.. `నో` చెప్పి ఉంటారు. నిజంగా.. చేసి ఉంటే, ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌ల పేర్లు చ‌రిత్ర‌లో నిలిచిపోదును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close