ఆ బడా కాంట్రాక్టర్‌పై టీడీపీకి కూడా అభిమానమే..!?

అధికార పార్టీలను ఇరుకున పెట్టే ఏ చిన్న అవకాశం వచ్చినా… ముందూ వెనుకా ఆలోచించకుండా ఉపయోగించుకునే తెలుగుదేశం పార్టీ .. ఓ విషయంలో సైలెంట్‌గా ఉంటోంది. రెండు తెలుగు ప్రభుత్వాలకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన కాంట్రాక్టర్ పై జరిగిన ఐటీ దాడులు.. బయటపడిన అవకతవకల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కల్కి ఆశ్రమంలో జరిగిన ఐటీ సోదాలు.. అక్కడ దొరికిన ఆస్తులు, నగదు వ్యవహారాలతో పోలిస్తే.. ఓ బడా కాంట్రాక్ట్ సంస్థ కార్యాలయంలో జరిగిన ఐటీ సోదాల్లో బయటపడినవి అనంతమైన అక్రమాలు. పైగా ఆ కాంట్రాక్ట్ సంస్థ.. చేసిన అక్రమాలు, అవినీతి అన్నీ ప్రజాధనంతో ముడిపడి ఉన్నవి. కల్కి ఆశ్రమం వ్యవహారం మాత్రం.. పూర్తిగా విరుద్ధం. వారికి ప్రభుత్వాలకు.. ప్రజాధనానికి సంబంధం లేదు. కానీ.. కాంట్రాక్ట్ సంస్థ విషయంలో మాత్రం.. వేల కోట్ల ప్రజధానం ఇమిడి ఉంది.

ప్రజలు పన్నుల రూపంలో కట్టే వేల కోట్ల రూపాయలు.. ఎంత అప్పనంగా.. ఇతరుల ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయో.. వెల్లడయ్యే సాక్ష్యాలు సోదాల్లో దొరికినట్లుగా ఐటీ, సీబీడీటీ విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటనలోనే స్పష్టమయింది. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీన పరిచేందుకు.. ఆర్థిక వ్యవస్థను సైతం నీరుగాల్చేందుకు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా కూడా విమర్శలొచ్చాయి. వ్యవస్థల్నే నిర్వీర్యం చేయగలిగేంతటి అతి పెద్ద ఫ్రాడ్ జరిగినప్పుడు.. రాజకీయ పార్టీలు ఎలా స్పందించాలి..? అధికార పార్టీలకు ఆ కాంట్రాక్ట్ సంస్థ ఓనర్ అత్యంత సన్నిహితుడు కాబట్టి.. వారు సైలెంట్ అయ్యారనుకుంటే.. ఓ లాజిక్ ఉంటుంది. బడా మీడియా సంస్థలు కూడా.. నోరు తెరవలేకపోయారంటే.. ఆ సంస్థ నుంచి పెద్ద ఎత్తున అందే ప్రకటనలు కారణం అనుకుంటారు. మరి ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎందుకు.. ఈ బడా కాంట్రాక్టర్‌పై నోరు తెరవడం లేదు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం.. నేతలు.. వారం, పది రోజుల పాటు ఆ కాంట్రాక్ట్ సంస్థపై ఐటీ దాడులు జరిగినా… నోరు మెదపలేదు. అధికారిక సమాచారం లేదు కాబట్టి.. సైలెంట్ గా ఉన్నారని అనుకున్నా… నేరుగా ఐటీ వర్గాలు ప్రకటించిన తర్వాత కూడా స్పందించలేదు. దీంతో.. తెలుగుదేశం పార్టీ కూడా ఆ బడా కాంట్రాక్టర్‌కు సన్నిహితమేనా అన్న చర్చ ప్రారంభమయింది. ఐటీ దాడుల్లో గుట్టు బయటపడిన ఆ బడా కాంట్రాక్టర్ అన్ని రాజకీయ పార్టీలతోనూ సన్నిహితంంగా వ్యవహరిస్తారు. అందరి అర్థిక వ్యవహారాలు తీర్చేందుకు ప్రయత్నిస్తారని చెబుతారు. ఏ ప్రభుత్వం ఉన్నా.. ఆయనకు ప్రాధాన్యం దక్కుతుంది. అయితే.. ఈ ప్రాధాన్యంలో కొంత తేడా ఉంటుంది. టీడీపీ హయాంలోనూ ఆ కాంట్రాక్టర్ కొన్ని.. బెంచ్ మార్క్ ప్రాజెక్టులు చేపట్టారు. ఈ కారణంగా… టీడీపీకీ ఆయన ఎన్నికల సాయం చేసి ఉంటారని అంటున్నారు. అందుకే.. ఆ బడా కాంట్రాక్టర్ పై ఐటీ సోదాలు.. ఆయన కంపెనీ తెలుగు రాష్ట్రాలను స్వీప్ చేస్తున్న విషయంపై మాట్లాడటానికి వెనుకంజ వేస్తున్నట్లుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

HOT NEWS

[X] Close
[X] Close