ఎడిటర్స్ కామెంట్ : సినిమాపై ఎందుకీ పగ !?

” హిజ్‌ ప్రెజెన్స్ ఈజ్ లైక్ ఏ నేచురల్ డిజాస్టర్. ఇంపాజిబుల్ టు ఎవాయిడ్ అండ్ ఆల్వేస్ లీవ్స్ డిస్ట్రక్షన్ బిహైండ్ ”
క్రూయల్ కింగ్ అని ఇంగ్లిష్ నవలలో రచయిత రీనా కెంట్ చెప్పిన వాక్యం ఇది. ఇవి చదువుతూంటే మనకు మన పాలకులు గుర్తుకు రాకుండా ఉండరు. ప్రజల ఒక్కొక్క ఉపాధిని అలా నరికేస్తూ పోతూంటే… ఆర్తనాదాలు వినిపించడానికి కూడా భయపడాల్సిన ఓ భయానక రాజ్యంలో బతుకులీడుస్తున్నారు. నోరెత్తితే ముందూ వెనుకా చూసుకోకుండా కడుపు మీద కొట్టడమే పాలనగా సాగుతున్న వ్యవస్థ బారిన పడుతోంది ఇప్పుడు సినిమా పరిశ్రమ. దేశ చరిత్రలో ఏ పాలకుడూ కూడా ఇంత దారుణంగా వంచించాలని అనుకోలేదు. ఇంత దారుణంగా కళాకారుల పొట్ట కొట్టాలనుకోలేదు. ఇంత దారుణంగా ఓ పరిశ్రమను మొదలకంటా నరకాలని అనుకోలేదు. కానీ ఆయన అనుకుంటున్నారు. అనుకున్నారు.. చేసి చూపిస్తున్నారు. సినిమాపై ఎందుకింత పగ..? సినిమా చేసిన పాపం ఏమిటి ?

సినిమాను శత్రువుగా చూసిన పాలకులు చరిత్రలో లేరు !

భారతీయ సినిమా. ప్రపంచంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు నిర్మించే దేశాల్లో భారత్‌ది అగ్రస్థానం. దీనికి కారణం.. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉండటం. అనేక భాషల్లో సినిమాలు నిర్మితమవుతూ ఉంటాయి. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, భోజ్‌పురి, పంజాబీ , ఒడియా, బెంగాలీ ఇలా ప్రతీ భాషలోనూ సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. ఎంతో సృజనాత్మకత బయటకు వస్తూ ఉంటుంది. ఈ సినిమాల పట్ల ఏ రాష్ట్రంలో అయినా ఓ ప్రత్యేకమైన ఆరాధనా భావమే ఉంటుంది. వాటిలో పని చేసే నటీనటులు కావొచ్చు.. సాంకేతిక నిపుణులు కావొచ్చు.. అందరూ ఓ రకంగా ప్రజల్లో సెలబ్రిటీ హోదాతో ఉంటారు. ఈ సినిమా ఇప్పటికిప్పుడు ఎదిగింది కాదు. అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. సినిమాల్లోకి సెలబ్రిటీలు వస్తున్నారు.. పోతున్నారు. కానీ సినిమా మాత్రం శాశ్వతం. ఏ ప్రభుత్వం కూడా సినిమాను సినిమాగానే చూసింది కానీ శత్రువుగా చూడలేదు. ఆ సినిమా సంగతి చూడాలని అనుకోలేదు. దేశంలో మొట్ట మొదటి సారిగా.. స్వతంత్ర భారతంలో సినిమాను శత్రువుగా చూసే పాలకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నారు. సినిమాను మొదలుకంటా నరికి.. మళ్లీ లేవకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందు కోసం ఎన్ని చేయాలో … అన్నీ చేస్తున్నారు. సినిమాపై ఇంత కసి ఎందుకో ఆ పాలకులకే తెలుసు. సామాన్యులకు అ‌ర్థం కాదు.

అంత తక్కువ రేట్లకు సినిమాలు చూపించాలనడం ఏం మనస్థత్వం !

దేశంలో ఏ మూలకు వెళ్లినా సింగిల్ టీ తాగాలంటే ఎంత ? కనీసం పది రూపాయలు పెట్టాలి. అంత ఎందుకు పదేళ్ల కిందట టీ రేట్ ఎంత ఉండేది ?. రూ. రెండు నుంచి మూడు లోపే ఉండేది. పదేళ్ల కిందట రూపాయికి ఎంత విలువ ఉండేది…? ఎంత ఉంటుంది..? అప్పుడైనా.. ఇప్పుడైనా రూపాయి.. రూపాయే కదా అనే వారుంటారు. అలాంటి మూర్ఖుల వల్లే ఇప్పుడు సమస్య అంతా. అప్పట్లో రెండు రూపాయలకు టీ వచ్చేది.. ఇప్పుడు రూ. పది ఖర్చు అవుతోంది. అలాంటప్పుడు అప్పటి రూపాయికి.. ఇప్పుడు రూపాయి ఎలా సమాధానం అవుతుంది..?. కానీ అవుతుంది అనే వాదించే వారి వల్లనే ఇప్పుడు సమస్య వచ్చింది. పదేళ్ల కిందటి నాటి సినిమా టిక్కెట్ రేట్లను ఖర్చు చేసిన ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీ చేసింది. వాటిని హైకోర్టు కొట్టి వేసినా నిర్మాతలు తమ సినిమాలకు టిక్కెట్ రేట్లను నిర్ణయించుకునే హక్కు మాత్రం రాలేదు. అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం తాను చెప్పిందే చేయాలని పట్టుబడుతోంది. రూ. ఐదు నుంచి ప్రారంభమయ్యే టిక్కెట్ రేట్లను మాత్రమే కొనసాగిస్తోంది. ఉదయం పూట బయట ఓ ప్లేట్ ఇడ్లీ కి అయ్యే ఖర్చు కన్నా తక్కువకే్.,. కొన్ని వందల మంది… కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సిద్ధం చేసిన సినిమాను చూసే చాన్స్ ఇస్తున్నారు. ఇది చూసే వారికి ఎలా ఉంటుందో కానీ.. కష్టపడిన వారికి మాత్రం మనసు మెలి పెడుతుంది. శ్రమకు తగ్గ ఫలితాన్ని ఆశించడం తప్పు కాదు.. వారి శ్రమను దోచి వేరే వారికి పెడతామనడం ఘోరమైన తప్పిదం. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది.

టిక్కెట్లూ తామే అమ్ముతామని చట్టం చేయడం ఏ రాజరికం !?

దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం బీహార్. అక్కడి ప్రజల తలసరి ఆదాయం తక్కువ. ప్రజల జీవన ప్రమాణాలు తక్కువ. అక్కడి ధియేటర్లలో టిక్కెట్ రేట్లు ఎలా ఉంటాయి..?. రూ. ఐదు .. పది మాత్రం కాదు. దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో ఎలాంటి టిక్కెట్ రేట్లు ఉంటాయో.. అక్కడా అంతే ఉంటాయి. ఆ మాటకొస్తే ఏపీలో ఉన్న టిక్కెట్ రేట్లు దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడా ఉండవు. ఎందుకంటే.. అంత తక్కువతో సినిమాలు చూపించి.. ధియేటర్లను నడుపుకోవడం.. నిర్మాతుల డబ్బులు సంపాదించుకోవడం అనేది అసాధ్యం. ఆ విషయం ఘనత వహించిన పాలకులకు తెలియనిదేం కాదు. ఎందుకంటే.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ వరకూ విడుదులైన అన్ని పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలకు చాన్సులిచ్చారు. టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతిచ్చారు. కానీ వకీల్ సాబ్ అనే సినిమా ఎప్పుడు రిలీజైందో.. అప్పుడే పురుగుకుట్టింది. అనుకున్న వారిని సర్వనాశనం చేసే శక్తి తమ చేతిలో ఉన్న అధికారంలో ఉందని వారు గట్టిగా నమ్మారు. రంగంలోకి దిగారు. అనుకున్నది అనుకున్నట్లుగా నరుక్కుంటూ పోతున్నారు. ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీని సగం నరికేశారు. ఇక మిగిలింది సగమే.

అయినా పగ చల్లాక థియేటర్లపైనా విరుచుకుపడటం ఏ తరహా పాలన !?

టిక్కెట్ రేట్లు పెంచండి మహా ప్రభో అని బతిమాలుకుంటే… మొత్తం టిక్కెట్లు తామే అమ్ముతమని మరో బండేసింది ప్రభుత్వం. మేము సినిమాలు తీయడం ఏమిటి.. మీరు టిక్కెట్లు అమ్ముకోవడం ఏమిటి అని ఇండస్ట్రీ వర్గాలు ఒక్క సారిగా గగుర్పాటుకు గురైంది. కానీ అది బయటకు కనిపిస్తే ఎక్కడ తమ ఆర్థిక పునాదులు కూల్చివేస్తారోనని చాలా మంది భయపడి బయటకు రాలేదు. అలా బయటకు వచ్చిన వారికీ సపోర్ట్ చేయలేదు. వారి మెదకదనం ప్రభుత్వానికి మరింత అడ్వాంటేజ్ అయింది. వెంటనే చట్టం చేసింది. జీవో విడుదల చేసింది. ఇక నుంచి అంటే ఏపీ ప్రభుత్వం ఎప్పుడు యాప్ రిలీజ్ చేస్తుందో అప్పట్నుంచి ఇక ఏపీలో ధియేటర్లలో టిక్కెట్లు అమ్మరు. పేటీఎంలో.. బుక్ మై షోలలో అమ్మరు. ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మాత్రమే అమ్ముతారు. కలెక్షన్లు కూడా ప్రభుత్వం ఖాతాకే పోతాయి. ప్రభుత్వం ఎప్పుడు తిరిగి ఇస్తే అప్పుడు తీసుకోవాలి. కాదు కూడదంటే.. సవాలక్ష నిబంధనలు ఉంటాయి.. ఏదో ఒకటి ఉల్లంఘించారని మొత్తం జప్తు చేసేసి.. కోర్టుకెళ్లుపో అని సలహా ఇవ్వొచ్చు. ఎవరూ ఏమీ చేయలేరు. జరబోయే పరిణామాలనూ అంచనా వేయలేరు. ఆ ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చుకుంటారో .. లేక ఆ ఆదాయన్నే వాడుకుంటారో అంచనా వేయడం కష్టమే.

పరిశ్రమకు కరోనా కన్నా అసలు ఉపద్రవం ఏపీ ప్రభుత్వం నుంచే !

ఓ వైపు టిక్కెట్ రేట్లు తగ్గించేశారు.. మరో వైపు టిక్కెట్లు తామే అమ్ముతామని చట్టం చేశారు. ఇప్పుడు కొత్తగా ధియేటర్ల మీద పడ్డారు. కరోనా దెబ్బకు పూర్తి స్థాయిలే కుదేలైపోయిన ధియేటర్ యాజమాన్యాలపై విరుచుకుపడుతున్నారు అధికారులు. ఏ సెంటర్స్.. బీ, సీ సెంటర్స్ అనే తేడా లేకుండా జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, ఎస్పీలు, డీఎస్పీలు, తహసీల్దార్ల వరకు రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు థియేటర్ల తనిఖీలు చేస్తున్నారు. జీవో 30 ప్రకారం థియేటర్లలో ఉండాల్సిన వసతులు, టికెట్ల ధరలు, క్యాంటీన్‌లో విక్రయించే తినుబండారాల ధరలను, థియేటర్ల నిర్వహణకు వివిధ శాఖలు జారీ చేసిన అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా తెలితే అక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. ఇలా దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ పదుల సంఖ్యలో ధియేటర్లను సీజ్ చేస్తున్నారు. పలు చోట్ల ఎగ్జిబిటర్లు ప్రభుత్వ వేధింపులను తట్టుకోలేమని.. టిక్కెట్ రేట్లు గిట్టుబాటు కావని చెబుతూ.. మూసేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సగం ప్రభుత్వం మూయిస్తే.. మిగతా సగాన్ని ఎగ్జిబిటర్లే మూసేసుకుంటున్నారు. అంటే ధియేటర్లనూ దివాలా తీయించేస్తున్నారన్నమాట. నిజానికి ఏపీ ప్రభుత్వం కరోనా నుంచి కోలుకున్న తర్వాత ధియేటర్లకు కరెంట్ బిల్లుల ఫిక్సుడ్‌ చార్జీల నుంచి మినహాయింపు.. వడ్డీ లేని రుణాలు అంటూ ఓ ప్యాకేజీ ప్రకటించింది. ఇండస్ట్రీలో చాలా మంది సూపర్ సీఎం సార్ అంటూ ట్వీట్లు కూడా చేశారు. కానీ ఆ ట్వీట్లకు కనీస విలువ కూడా దక్కలేదు. ఆ ప్రకటనలో ఒక్క హామీ కూడా అమల్లోకి రాలేదు. పైగా ఇప్పుడు ఆ ధియేటర్ల సంగతి చూస్తున్నారు.

సినిమాలను ఆపేస్తే ఆ సామాజికవర్గాలు కాళ్ల బేరానికి వస్తాయని ఆశ పడుతున్నారా ?

సినిమాలకు దసరా ఎలాగో.. సంక్రాంతి సీజన్ కూడా అంతకు మించి అనుకోవచ్చు. ఆ సీజన్‌లో వచ్చే సినిమా లు సాధించే కలెకన్షన్లతో టాలీవుడ్ కళకళాడుతుంది. పండగ సీజన్ కావడంతో సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయి. ఇలాంటి సమయంలో తనిఖీల పేరుతో ధియేటర్లను సీజ్ చేస్తూండటంతో టాలీవుడ్‌లోనూ ఆందోళన నెలకొంది. ఈ సీజన్‌లో ఇప్పటికే అఖండ, పుష్ప సినిమాలు విడుదలయ్యాయి. ఏపీలో ఈ రెండు సినిమాలను కొన్న డిస్ట్రిబ్యూటర్లు.. సాధారణంగా అయితే భారీ లాభాలను అందుకోవాలి. కానీ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అందుకోవడం కూడా కష్టంగా మారింది. ఇక ముందు ముందు అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొడుతున్న చావుదెబ్బతో ఆ సినిమాలు ఆర్థికంగా కుంగిపోవడం ఖాయం. ఈ సీజన్ మిస్సయితే ఆ ప్రభావం టాలీవుడ్‌పై ఎక్కువే ఉంటుంది. మొత్తంగా చూస్తే ఏపీలోసినీ పరిశ్రమ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ధియేటర్ యాజమాన్యాలు ప్రత్యేకంగా సమావేశమై.. ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నాయి. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని సామెత. ఇప్పుడు టాలీవుడ్‌లోని వాళ్ల పరిస్థితి కూడా అదే.

నష్టపోయేది ఆ సామాజికవర్గాలు కాదు ఉపాధి పొందుతున్న బడుగు, బలహీనలే !

ప్రభుత్వం టాలీవుడ్ నుంచి ఏం ఆశిస్తోంది..? ఎందుకు ఇంత దారుణంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు..?. టాలీవుడ్‌లో ఏపీ ప్రభుత్వ పాలకులకు ఇష్టమైన సామాజికవర్గానికి ఆధిపత్యం లేదు. కొంత మంది మాత్రమే ఉన్నారు. అక్కడ రెండు సామాజికవర్గాలు ప్రధానంగా ఉన్నాయి. కానీ ఇతరుల ప్రభావం తక్కువేమీ కాదు. కానీ అందర్నీ ఆర్థికంగా దెబ్బకొట్టాలంటే.. సినిమా పరిశ్రమను మొదలకంటా నరికేయాలన్న వ్యూహాన్ని ఏపీ పాలకులు పాటిస్తున్నారు. అమలు చేస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల ఎవరు నష్టపోతున్నారు ? హీరోలా ? దర్శకులా ? నిర్మాతలా? . ఈ ముగ్గురూ నష్టపోరు. అసలు నష్టపోయేది.. ఇండస్ట్రీని నమ్ముకుని కుటుంబాల్ని పోషించుకుంటున్న వేలాది మంది కళాకారులు.. టెక్నిషియన్లు.. జూనియర్ ఆర్టిస్టులు వంటి వారే నష్టపోయేది. ఇండ్ట్రీ అంటే రూ. కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే నలుగురు హీరోలు కాదు. నిజం చెప్పాలంటే.. వారు ఇండస్ట్రీకి పిల్లర్లు అనుకోవడమే. అసలు భారాన్ని మోసేది మొత్తం… షూటింగ్ జరిగితే తప్ప పూట గడవని కుటుంబాలను పోషిస్తున్న చిన్న ఆర్టిస్టులు.. టెక్నిషియన్లే. మొత్తం 24క్రాఫ్టుల్లో పని చేసే లక్షలాది మంది కలిస్తేనే ఇండస్ట్రీ. కానీ పై స్థాయిలో కనిపించే ఆ నలుగురిలో కొంత మంది తమను వ్యతిరేకిస్తున్నారో.. ఇతరులను అభిమానిస్తున్నారో.. తమ సామాజికవర్గం కాదనో.. పగబడితే.. నష్టపోయేది ఆ కార్మికులే.

హిజ్‌ ప్రెజెన్స్ ఈజ్ లైక్ ఏ నేచురల్ డిజాస్టర్…అంతా కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవాల్సిందే..!

సినిమా ఇండస్ట్రీపై చేస్తున్న దాడిని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. టిక్కెట్ రేట్లను నియంత్రించవద్దా అంటోంది. నిజానికి సినిమా నిత్యావసరం కాదు. కనీసం సిగరెట్లలాగానో.. మద్యం లాగానో … పట్టుకుంటే వదలనంత దురలవాటు కూడా కాదు. అదో కళ. దానిపై ఆసక్తి చూపిన వారు అటు వైపు వెళ్తారు. లేకపోతే లేదు. కానీ ఏపీలో ఇప్పుడు.. నిత్యావసర వస్తువల ధరలు ఎలా ఉన్నాయి..?. అసలు బానిసల్లాగా మార్చుకున్న మద్యాన్ని ఎంత ధరకు అమ్ముతున్నారు ? అక్కడ ప్రజలు దోపిడీకి గురి కావడం లేదా..? ఆ దోపిడీ చేస్తున్నదెవరు ? సినిమాటిక్కెట్ల విషయంలోనే ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు ?. నిశితంగా ఆలోచిస్తే కనిపిస్తున్న కారణం ఒకటే. ఆ సామాజికవర్గాలను దారుణంగా దెబ్బకొట్టడం. కానీ ఇక్కడ జరుగుతోంది వేరు. ఆ సామాజికవర్గాల కన్నా.. బడుగు, బలహీనవర్గాలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. వారెలా పోయినా తన పంతం నెగ్గాలనేది పాలకులపట్టుదల. అందుకే.. ” హిజ్‌ ప్రెజెన్స్ ఈజ్ లైక్ ఏ నేచురల్ డిజాస్టర్. ఇంపాజిబుల్ టు ఎవాయిడ్ అండ్ ఆల్వేస్ లీవ్స్ డిస్ట్రక్షన్ బిహైండ్ ” అని ముందు చెప్పుకున్నది. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close