ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ జగన్ అని క్లారిటీ ఇచ్చేశారు రాజ్ కసిరెడ్డి. సిట్ విచారణలో ఆయన పూసగుచ్చినట్లుగా వివరాలను బయటపెట్టారు. పార్టీకి, నేతలకు లబ్ది చేకూర్చేలా పాలసీని రూపొందించాలని జగన్ ఆదేశాలతోనే నడుచుకున్నట్లు చెప్పారు. లిక్కర్ ముడుపులో జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి తో పాటు పలువురికి ఇందులో పాత్ర ఉందని రాజ్ కసిరెడ్డి అంగీకరించినట్లు సిట్ వెల్లడించింది. వాస్తవానికి జగన్ పేరును ఎట్టిపరిస్థితుల్లోనూ రాజ్ కసిరెడ్డి బయటపెట్టరని అంచనా వేసి… విజయసాయిరెడ్డి జగన్ గురించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు.
అనూహ్యంగా , సిట్ విచారణలో జగన్ డైరెక్షన్ లోనే ఈ పాలసీకి రూపకల్పన చేసినట్లు రాజ్ చెప్పారు. అంటే ఈ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి కాదు.. జగనే అనేది స్పష్టం అవుతోంది. విజయసాయిరెడ్డి మాత్రం జగన్ గురించిన సమాచారం రాబట్టేందుకు సిట్ ఎంత ప్రయత్నించినా గుర్తులేదు, తెలియదనే సమాధానాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ కీలక సమాచారాన్ని రాజ్ బయటపెట్టేయడంతో విజయసాయిరెడ్డి ఖంగుతిన్నారు. జగన్ పేరును చెప్పడం ఏంటని నోరెళ్ళబెడుతు ఉండొచ్చుననే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రాజ్ కసిరెడ్డి జగన్ పేరు మాత్రమే కాదు.. విజయసాయిరెడ్డి పాత్రపై కూడా సిట్ కు వివరించారు. ఇది విసారెడ్డి ఊహించనిపరిణామం. ఎందుకంటే , విజయసాయిరెడ్డి పేరును రాజ్ కసిరెడ్డి బయటపెడితే , విజయసాయిరెడ్డి ఏం తక్కువ. ఆయన జగన్ పాత్ర గురించి చెబుతానని ధీమాగా ఉన్నారు. ఇంతలోనే ఇద్దరి పేర్లను రాజ్ బయటపెట్టడంతో ఈ కేసులో ఏ5గా విజయసాయిరెడ్డి పేరును రిమాండ్ రిపోర్ట్ లో చేర్చారు సిట్ అధికారులు. దీంతో ఆయన ముందుగానే పూర్తి వివరాలు బయటపెట్టి ఉంటే ఈ కేసు నుంచి సేఫ్ గా బయటకు వచ్చేవారు. ఇప్పుడు రాజ్ సమాచారంతో విజయసాయిరెడ్డి నిందితుడిగా మారిపోయారు.