మంత్రి అనిల్ కుమార్ విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం అవుతున్నారా..?

కృష్ణాన‌ది వ‌ర‌ద‌లు ప్ర‌కృతి వైప‌రీత్యం కాదు, ప్ర‌భుత్వ వైప‌రీత్య‌మే అని ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. దీన్ని వెంట‌నే తిప్పి కొట్టేందుకు రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ స్పందించారు. త‌న వ్యంగ్య ధోర‌ణిలో, ఏనాడైనా చంద్ర‌బాబు నిజాలు చెప్పారా అనీ, చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదంటూ ప్ర‌జ‌లు ఎందుకు ఓడించారో ఆయ‌న‌కి ఇంకా అర్థం కావ‌డం లేద‌నీ, క‌రువుని సృష్టించింది ఆయ‌నేన‌నీ.. ఇలా చాలా త‌ర‌చూ విమ‌ర్శిస్తున్న త‌ర‌హాలోనే తిప్పి కొట్టారు. ఈ స‌మ‌యంలో కూడా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు త‌న ఇంటి ముంపు గురించే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తూ మాట్లాడార‌నే వ్యాఖ్య కొంత స‌మంజ‌సంగానే ఉంది. రాజ‌కీయ వ్యాఖ్యానాలు కాసేపు ప‌క్క‌న‌పెడితే… వ‌ర‌ద రూపంలో రాష్ట్రానికి భారీ ఎత్తున నీరు వ‌చ్చింది. దాన్ని రాష్ట్ర అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా వినియోగించుకునే ప్ర‌య‌త్నాన్ని జ‌ల‌వ‌న‌రుల శాఖ‌గానీ, మంత్రిగానీ ప్ర‌య‌త్నించారా… అనేది చ‌ర్చించాల్సిన అంశ‌మే.

ఆల్మ‌ట్టీ నుంచి నారాయ‌ణ‌పూర్, జూరాల మీదుగా శ్రీశైలానికి పెద్ద మొత్తం నీరు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈనెల మొద‌టివారంలో నీరొచ్చింది. అయితే, నీరు వ‌చ్చీరాగానే తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి నీటిని త‌ర‌లించుకుంది. అదే రోజున ప‌వ‌ర్ జ‌న‌రేష‌న్ కూడా తెలంగాణ ప్రారంభించేసింది. నాలుగో తేదీని నీళ్లొస్తే… అదే రోజున పొరుగు రాష్ట్రం దాన్ని వినియోగించుకుంటూ ఉంటే… ఆరో తేదీ వ‌ర‌కూ ఆ నీటిని రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించొచ్చు అని ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ ఆలోచించ‌నే లేదు! నిజానికి, ఆరోజునే పోతిరెడ్డిపాడుకి నీటిని విడుద‌ల చెయ్యొచ్చు. కానీ, వెంటనే ఆ ప‌ని చెయ్య‌కుండా మ‌ర్నాటి నుంచి దాదాపు ప‌దిరోజుల‌పాటు కొద్దికొద్దిగా నీటిని విడుద‌ల చేశారు. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం అందుబాటులో ఉన్న నీటిని త‌ల‌రించలేద‌నేది నిపుణుల మాట‌. బ్ర‌హ్మంగారిమ‌ఠం రిజ‌ర్వాయ‌రు, గండికోట‌, మైల‌వ‌రం, సోమ‌శిల‌, కండ‌లేరు… ఇవ‌న్నీ ఖాళీగా ఉన్న ప‌రిస్థితి ఉందంటున్నారు! వ‌ర‌ద నీరు వ‌స్తోంద‌ని తెలిసిన మొద‌టి రోజు నుంచీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌రీకి ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం నీరు తెచ్చి ఉంటే… ఈరోజున ఇవ‌న్నీ పూర్తిగా నిండే అవ‌కాశం ఉండేద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

వ‌ర‌ద‌లు ప్రారంభ‌య్యాక కేవ‌లం రాజ‌కీయ విమ‌ర్శ‌ల మీద మాత్ర‌మే జ‌ల‌వ‌న‌రుల మంత్రి అనిల్ కుమార్ ఫోక‌స్ పెట్టారు త‌ప్ప‌, నీటిని స‌ద్వినియోగం చేసుకోవ‌డంపై ఆయ‌న ఆలోచించ‌లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. సొంత రాయ‌ల‌సీమ ప్రాంతం క‌రువులో ఉంద‌ని తెలిసీ, నీరు అందుబాటులోకి వ‌చ్చాక కూడా దాన్ని నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితిలో మంత్రి ఉన్నార‌నీ, మీడియా స‌మావేశాల్లో జోకులేసుకుంటూ ఆయ‌న కాలం గ‌డిపేశార‌నే విమ‌ర్శ‌లు కొంత‌మంది చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కట్‌ చేసిన జీతాలు,పెన్షన్లను 12 శాతం వడ్డీతో చెల్లించాల్సిందే..!

కరోనా పేరు చెప్పి రెండు నెలల పాటు సగం సగం జీతాలే ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జీతాలు, పెన్షన్‌ బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.మార్చి, ఏప్రిల్ నెలల్లో బకాయిపడిన 50శాతం...

జగన్ అనుకుంటే అంతే.. ! ఎమ్మెల్సీ టిక్కెట్ ఆయన కుమారుడికి..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైనా అనుకుంటే ఇట్టే నిర్ణయం తీసుకుంటారు. దానికి ముందూ వెనుకా ఎలాంటి మొహమాటాలు పెట్టుకోరు. దానికి తాజాగా మరో ఉదాహరణ ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థి ఎంపిక. రాజ్యసభకు...

వైసీపీలోనూ అలజడి రేపుతున్న రాపాక..!

జనసేన తరపున గెలిచి తాను వైసీపీ మనిషినని చెప్పుకుంటున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆ పార్టీలోనూ చిచ్చు పెడుతున్నారు. రాజోలు వైసీపీలో మూడు గ్రూపులున్నాయని.. అందులో తనది ఒకటని స్వయంగా...

బిగ్ బాస్ – 4 వాయిదా?

బిగ్ బాస్ రియాలిటీ షో.. తెలుగులోనూ సూప‌ర్ హిట్ట‌య్యింది. ఎన్టీఆర్‌, నాగార్జున‌, నాని లాంటి హోస్ట్ లు దొర‌క‌డంతో బిగ్ బాస్ కి తెలుగు ఆన‌ట ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్పుడు నాలుగో సీజ‌న్...

HOT NEWS

[X] Close
[X] Close