సీఎం జ‌గ‌న్ కోరిన అంశాల‌పై కేంద్రం మ‌ళ్లీ స్పందిస్తుందా..?

పార్ల‌మెంటులో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నిర్ణ‌యంపై వాడీవేడీ చ‌ర్చల్లో బిజీబిజీగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఉన్నారు. ఈ స‌మ‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో కాసేపు భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల‌పాటు ఇద్ద‌రూ మాట్లాడుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానికి ఒక విన‌తి ప‌త్రం ఇచ్చారు ఏపీ సీఎం. దీనిలో ప్ర‌ధానంగా ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌నే డిమాండ్ తోపాటు, పరిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన ప‌న్నుల రాయితీలు క‌ల్పించాల‌ని కూడా కోరారు. ప‌దేళ్ల‌పాటు జీఎస్టీ మిన‌హాయింపు, ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపు కోరారు. రెవెన్యూ లోటు పూడ్చ‌డం కోసం దాదాపు రూ. 23 వేల కోట్లు ఇవ్వాల‌ని అడిగారు. పోల‌వ‌రం కోసం ఖ‌ర్చు చేసిన రూ. 5 వేల కోట్ల నిధుల‌ను విడుద‌ల చేయాల‌న్నారు. దీంతోపాటు, పీపీయే ఒప్పందాలు, అమ‌రావ‌తి నిర్మాణం అంశాలపై కూడా ఈ భేటీలో ప్ర‌ధానితో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

నిజానికి, వీటిలో ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదాపై కేంద్రం చాలా స్పష్ట‌త ఇచ్చేసింది. బ‌డ్జెట్ సంద‌ర్భంగా పార్ల‌మెంటులో నిర్మ‌లా సీతారామ‌న్, ఆ త‌రువాత రాష్ట్రానికి వ‌చ్చిన కొంద‌రు జాతీయ నేతలు హోదా ఇవ్వ‌లేం అని స్ప‌ష్టంగానే చెప్పేశారు. ఇక‌, ప‌రిశ్ర‌మ‌ల‌కు జీఎస్టీ మిన‌హాయింపులు, ప‌న్నుల రాయితీల‌పై కూడా కేంద్రం ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త ఇచ్చేసింది. జీఎస్టీ అనేది ఒక రాష్ట్రం కోసం విధానాలు మార్చలేమ‌నీ, దేశంలో అమ‌లు జ‌రుగుతున్న సంక్షేమ ప‌థ‌కాల ద్వారానే ఏపీకి ల‌బ్ధి జ‌రుగుతుంద‌నీ, ప్ర‌త్యేకంగా అంటూ ఏమీ ఉండ‌ద‌నీ ఇటీవ‌లే కేంద్ర‌మంత్రి నితిన్ గ‌ట్క‌రీ కూడా చాలా స్ప‌ష్టంగా చెప్పేశారు. సో.. సీఎం జ‌గ‌న్ ఇచ్చిన విన‌తి పత్రంలో కీల‌క అంశాల‌పై ఇప్ప‌టికే కేంద్రం స‌మాధానం ఇచ్చేసిన‌ట్టే లెక్క‌. ఇక‌, మిగిలిన‌వి పోల‌వ‌రం బిల్లులు, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ నిధులు. వాటిపై కూడా కేంద్రం ఇప్ప‌టికే మీన‌మేషాలు లెక్కిస్తోంది. పోల‌వ‌రం నిర్మాణం ఇప్ప‌టికీ రాష్ట్రం చేతుల్లోనే ఉంద‌నీ, ఆల‌స్యానికి కార‌ణం రాష్ట్రమే అన్న‌ట్టుగా భాజ‌పా నేత‌లు మాట్లాడుతున్నారు.

పీపీయేల ర‌ద్దు, పోల‌వ‌రం ప‌నుల్లో రివ‌ర్స్ టెండ‌రింగ్… వీటిపై కేంద్రం నుంచి కొన్ని అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానితో భేటీలో ఈ అంశాలు కూడా ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. అయితే, బుధ‌వారం కూడా సీఎం ప‌ర్య‌ట‌న ఢిల్లీలో కొన‌సాగుతుంది కాబ‌ట్టి, ప్ర‌ధానితో చ‌ర్చ‌ల సారాంశాన్ని ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టి వెల్ల‌డించే అవ‌కాశం ఉంటుంది. ఏదేమైనా, ప్ర‌ధానికి ఇచ్చిన విన‌తి ప‌త్రంలో ఏపీ సీఎం ప్ర‌స్థావించిన కొన్ని కీల‌క అంశాల‌పై ఇప్ప‌టికే కేంద్రం స్ప‌ష్ట‌త ఇచ్చేసిన‌ట్టే. మ‌రోసారి గుర్తు చేసిన ప్ర‌త్యేక హోదాపై మ‌రోసారి స్పంద‌న ఉంటుందా లేదా అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close