సీఎంల స్నేహం ప్రజలకు ఉపయోగపడలేదా..!?

హైదరాబాద్‌లో ఉంటూ పండుగకు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రయాణం పెట్టుకున్న వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పరిమితమైన ప్రత్యేక రైళ్లు, ప్రైవేటు బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. పండుగ సీజన్లో 80 శాతం ప్రయాణికుల అవసరాలు తీర్చే ఆర్టీసీ బస్సుల జాడ మాత్రం లేదు. అటు తెలంగాణ బస్సులు కానీ.. ఇటు ఏపీ బస్సులు కానీ.. అటూ ఇటూ తిరగడం లేదు. అంతర్రాష్ట్ర సరిహద్దులన్నింటినీ తెరిచినా… బస్సులు మాత్రం నడవడానికి వీల్లేదని.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భీష్మించుకు కూర్చున్నాయి. బస్సులు తిరగాలంటే ఒప్పందం చేసుకోవాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.. ఒప్పందం చేసుకుంటే ప్రైవేటు బస్సులకే మేలు జరుగుతుందని ఏపీ ప్రభుత్వం వేచి చూస్తోంది. ఫలితంగా బస్సులు సరిహద్దులు దాటడం లేదు.

ప్రత్యేక రైళ్లు, ప్రైవేటు బస్సుల్లో వెళ్లలేని సామాన్యులకు ఒకే ఒక్క రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సు. ఇప్పుడు దాన్ని అందుబాటులోకి తేవడంతో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. తెలంగాణ నుంచి ఒక్క ఏపీకి తప్ప.. అన్ని రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఏపీ నుంచి కూడా అంతే.. హైదరాబాద్‌కు తప్ప.. అన్ని చోట్లకు వెళ్తున్నాయి. కానీ రాకపోకల డిమాండ్ మాత్రం హైదరాబాద్ నుంచే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయిన ఏపీ సర్కార్.. ఎలాగోలా.. సరిహద్దు వరకు వస్తే.. అక్కడ్నుంచి బస్సులు ఏర్పాటు చేశామని సందేశం పంపుతోంది.

అధికారుల స్థాయిలో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. చర్చలు జూన్‌లోనే ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటి వరకూ కొలిక్కి రాలేదు. కానీ చర్చలను పై స్థాయికి తీసుకెళ్లలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాధినేతలు.. ఈ బస్సుల సమస్యపై కన్నేయలేదు. అసలు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి… బస్సులు నడిపేలా చేయడంలో ఏపీ సర్కార్ విఫలమయింది. సీఎంల మధ్య విబేధాలు లేవు. ప్రభుత్వాధినేతల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నాయి. అయినా వారు పట్టించుకోవడం లేదు. మంత్రుల స్థాయిలో కూడా చర్చలు జరగడం లేదు. రాజకీయ అంశాల విషయంలో ముఖ్యమంత్రులిద్దరూ ఒకే మాట మీద ఉంటారు. కానీ ప్రజా సమస్యలకు సంబంధించిన విషయంలో కనీసం చొరవ తీసుకోకపోవడం… అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం భిన్నంగా జరుగుతోంది. కారణం ఏమిటో కానీ సమస్య పరిష్కారానికి పెద్దలు చొరవ తీసుకోలేదు. ఫలితంగా ప్రజలు… ప్రైవేటు బస్సులకు డబ్బులు వదిలించుకోవాల్సి వస్తోంది..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close