లవ్ టుడే, డ్రాగన్ లాంటి యూత్ ఫుల్ కథలతో రెండు వరుస విజయాలు అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. నిజానికి ఈ జనరేషన్ యూత్ పల్స్ పట్టుకోవడంలో తనకి మంచి గ్రిప్ ఉంది. ఇప్పుడు డ్యూడ్ ప్రమోషనల్ మెటీరియల్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉంది. జెన్జీ ఆడియన్స్ కి ఏం క్యాటర్ చేయాలో ప్రదీప్ రంగనాథన్ కి ఒక ఐడియా ఉంది. ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్లో సినిమా వైబ్ చూపించారు. కానీ కథ రివిల్ చేయలేదు. అయితే తొలిసారిగా ఈ సినిమా కథ గురించి దర్శకుడు కీర్తి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు.
డ్యూడ్ కథ రాయడానికి స్ఫూర్తి సుకుమార్ అల్లు అర్జున్ ఆర్య సినిమా అంట. ఆర్యస్ఫూర్తితోనే డ్యూడ్ కథ రాశానని చెప్పాడు కీర్తి. ప్రేమ కథల్లో ఆర్య ఒక ట్రెండ్ సెట్టర్. అప్పటివరకు వచ్చిన లవ్ స్టోరీలకి ఆర్య ఒక కొత్త భాష్యాన్ని చెప్పింది. వన్ సైడ్ లవర్ అనే పాయింట్ ని ఎలివేట్ చేసింది. సుకుమారు ఓ కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. నిజంగా ఆర్య తర్వాత మళ్లీ అలాంటి ఒక యూనిక్ పాయింట్ ఉన్న కథ ఇప్పటివరకు రాలేదని చెప్పాలి. రెండు దశాబ్దాలు తర్వాత ఆర్య కథ నుంచి ఇన్స్పిరేషన్ పొందడం అంటే నిజంగా ఆసక్తికరమైన విషయమే. ఆర్య ఇన్స్పిరేషన్ నుంచి వస్తున్న ఈ డ్యూడ్ కథ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే గనక హిట్ దక్కేసినట్లే.