మంత్రి పదవుల విషయంలో జగన్ మాట నిలబెట్టుకుంటారా..?

జగన్ కమిట్‌మెంట్ ఉన్న నేత…మాట ఇస్తే తప్పరు అంటారు.. వైసీపీ నేతలు. మంత్రి పదవుల విషయంలో ఇప్పుడా మాట నిలబెట్టుకోవాలంటే.. ఓడిపోయిన వారికి… అసలు పోటీ చేయని వారికి కూడా… మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జగన్ కేబినెట్ కసరత్తును దాదాపుగా పూర్తి చేశారని చెబుతున్నారు. ప్రాంతాలు, జిల్లాలు, కులాలు, మతాలు, సీనియారిటీ ఇలా ఎన్నింటినో పరిగణనలోకి తీసుకుని ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు.

ముగ్గురికి ముందుగానే మంత్రి పదవుల హామీ..!

ఎన్నికల ప్రచార సభల్లోనే.. వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరికి మంత్రి పదవులు ఇస్తాననేదానిపై జగన్ ప్రకటనలు చేశారు. గెలిపించండి.. మంత్రిని చేస్తానని.. అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. చిలకలూరిపేట టికెట్‌ను విడదల రజనికి త్యాగం చేసినందుకు…మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఖాయమనే ప్రచారం నడుస్తోంది. మాట నిలబెట్టుకుంటారన్న పేరు నిలబడటానికయినా… వీరిని మంత్రుల్ని చేయాల్సి ఉంది.

సీనియర్లకు చాన్స్ లేనట్లే..!?

శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మంత్రి పదవులను ఆశిస్తున్నారు. విజయనగరం జిల్లా నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర రేస్‌లో ఉన్నారు. విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌, పాయకరావుపేట ఎమ్మెల్యే గొర్లె బాబూరావు, మాడుగుల ఎమ్మెల్యే ముత్యాలనాయుడు అమాత్య పదవులపై ఆశలు పెట్టుకున్నారు. 34 నియోజకవర్గాల్లో గోదావరి జిల్లాల నుంచి ఏడుగురి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఓటమిపాలైనా ఆయన ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వైసీపీని స్థాపించినప్పుడు జగన్‌ను అనుసరించినవారిలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఒకరు. బోస్‌తో పాటు ఈ జిల్లా నుంచి కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కన్నబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా విషయానికి వస్తే ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ను ఓడించిన గ్రంథి శ్రీనివాస్‌ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

కులాలు, మతాల ప్రాతిపదికగా మంత్రి పదవుల పంపకం ఓ సవాలే..!

మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్రను ఓడించిన పేర్ని నాని, మాజీ మంత్రి..పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి …ఈ ఇద్దరితో పాటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు పేర్లు కృష్ణా జిల్లా నుంచి వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్‌కు ఇదివరకే మంత్రి పదవులు ఇస్తామని ఖాయం చేశారు జగన్‌. అయితే ఇదే జిల్లా నుంచి మరో ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటిరాంబాబు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి కేబినెట్‌లో రేస్‌లో ఉన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రిపదవి ఇస్తానని జగన్‌ గతంలోనే స్పష్టం చేశారు. ఇదే జిల్లాకు చెందిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో పాటు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

రాయలసీమలో వేరే వర్గం వారికి ఇవ్వగలరా..?

రాయలసీమ నుంచి 11 మంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషా రేస్‌లో ఉన్నారు. కర్నూలు జిల్లాలో డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఖరారైనట్లే. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి గ్యారెంటీ అని టాక్‌ నడుస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా పేర్లు మంత్రివర్గం కూర్పు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు అనంతపురం జిల్లాలో… సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డితో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ…కేబినెట్ రేస్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close