మహారాష్ట్ర స్టైల్లో నెక్ట్స్ కేసీఆర్‌ను టార్గెట్ చేస్తారా !?

మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్దవ్ ధాకరేను ఎమ్మెల్యేలు పూర్తిగా విడిచి పెట్టేయడం.. దానికి వారు చెప్పిన కారణాలు చూస్తే.. తెలంగాణలోనూ అలాంటి పోలికలు ఉన్నాయని అందరికీ అనిపించకమానదు. అపాయింట్‌మెంట్లు ఇవ్వడంలేదని.. నిధులు ఇవ్వడం లేదని.. ఇతరులకే ప్రాధాన్యం లభిస్తోందని .. అందుకే తాము అవమానం ఫీలయ్యామని శివసేన ఎమ్మెల్యేలు అంటున్నారు. అచ్చంగా తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంది. కేసీఆర్ కోరుకుంటే తప్ప.. ప్రగతి భవన్‌లోకి ఎవరికీ ఎంట్రీ ఉండదు. ఈటల రాజేందర్ తాము ఎన్ని సార్లు అవమానాలకు గురయ్యామో పార్టీ నుంచి గెంటేసిన తర్వాత చెప్పుకున్నారు.

హరీష్ రావు, గంగుల కమలాకర్‌లకూ అదే పరిస్థితి వచ్చిందని చెప్పారు. నిజానికి టీఆర్ఎస్‌లో మెజార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకడం కష్టం. కేసీఆర్ కలవాలనుకుంటే మాత్రమేకలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానేపార్టీ నేతల్లో అసంతృప్తిఉంది. ఇక నిధుల విషయంలోనూ ఎమ్మెల్యేల అసంతృప్తి చాలా సార్లు బయటపడింది. పార్టీ నాయకులేక బిల్లులు రావడం లేదన్న ఆగ్రహం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్యేలను… బీజేపీ టార్గెట్ చేస్తే.. వారివలలో సులువుగా చిక్కుకుంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే మహారాష్ట్రలో బీజేపీకి కొంత బలం ఉంది.

శివసేన ఎమ్మెల్యేలను చీల్చితే… బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణలో అలాంటి పరిస్థితిలేదు. ఏం చేసినా బీజేపీ ప్రభుత్వం ఏర్పడదు. అదే సమయంలో కేసీఆర్‌ను కాదని పార్టీని చీల్చే నాయకులు కొద్దిమందే ఉన్నారు. వారుతిరుగుబాటు చేస్తారో లేదో చెప్పడం కష్టం. కానీ ప్రజల్లో కనిపిస్తున్న అసంతృప్తిని బీజేపీ ఉపయోగించుకోదల్చుకుంటే… మహారాష్ట్ర రాజకీయాలు… తెలంగాణలో చూసినా ఆశ్చర్యం లేదని కొంత మంది వాదన వినిపిస్తున్నారు. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు.. ఎందుకంటే ధాకరే ఫ్యామిలీనే ఎమ్మెల్యేలు వద్దనుకుంటారని ఎవరూ ఊహించలేదు మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close