‘మెంటల్ మదిలో’ ప్రీ టాక్: మరో పెళ్లిచూపులు అవుతుందా?

న్యూ జనరేషన్ లవ్ స్టోరీలకు కొత్త ఊపిరి పోసింది.. పెళ్లి చూపులు. చిన్న సినిమా మళ్ళీ కాలరెత్తుకుని ఆకాశం వైపు చూసేలా చేసింది. అర్జున్ రెడ్డి కూడా… కొత్త ఆశలు చిగురించేలా చేసింది. కాన్సెప్ట్ బాగుంటే చాలు.. స్టార్స్ అవసరం లేదు అని తెలియ చెప్పిన సినిమాలవి. ఇప్పుడు మరో చిన్న సినిమా కూడా ఇలాంటి ఆశలే రేపుతోంది. అదే… మెంటల్ మదిలో. శ్రీ విష్ణు కథానాయకుడిగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. పెళ్ళి చూపులు టీమ్.. రాజ్ కందుకూరి, సురేష్ బాబు ఈ చిత్రాన్ని రూపొందించారు.

27 న విడుదల అవుతోంది. ఇప్పటికే ప్రివ్యూలు పడిపోయాయి.

సినిమా చూసినవాళ్ళంతా అద్భుతం… అమోఘం అంటున్నారు. సోషల్ మీడియా లో… మెంటల్ మదిలో టాక్ హల్చల్ చేస్తోంది. మరో పెళ్లి చూపులు అవ్వడం ఖాయమన్నది వాళ్ళ మాట. అక్కడక్కడ కాస్త స్లో నేరేషన్ ఇబ్బంది పెట్టినా.. చిన్న పాయింట్ ని దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశాడని, ఈ సినిమా బయటకి వచ్చాక వివేక్ తప్పకుండా స్టార్ హీరోల ఆఫర్లు అందుకుంటాడని జోస్యం చెపుతున్నారు. ఇప్పటికే ఓ అగ్ర నిర్మాణ సంస్థ వివేక్ కి అడ్వాన్స్ ఇచ్చేసిందట. మంచి కథల్ని ఎంచుకుంటున్న శ్రీ విష్ణు ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా అందుకోలేదు. ఈ సినిమా ఆ లోటు తీర్చేలా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close