ఆర్టీసీకి మ‌ద్ద‌తుగా ఉద్యోగ సంఘాలు నిలుస్తాయా..?

ఆర్టీసీ కార్మికుల‌కు ఉద్యోగ సంఘాలు మ‌ద్ద‌తు ఇస్తే… స‌మ్మె మ‌రింత తీవ్ర‌త‌రం అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రో స‌క‌ల జనుల సమ్మె స్థాయికి ఈ పోరాటం చేరుకుంటుంది. అదే వ్యూహంతో అఖిల ప‌క్షం ఉంది. ఉద్యోగ సంఘాల మ‌ద్ద‌తు కోరాల‌ని ప్ర‌య‌త్నించింది. కానీ, ఈలోగానే సీఎం కేసీఆర్ నుంచి కొన్ని ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు ఆహ్వానం రావ‌డం, వారు ముఖ్య‌మంత్రితో క‌లిసి భోజ‌నం చేయ‌డం, అర్ధ‌గంట‌పాటు చర్చ‌లు జ‌ర‌గ‌డం అయిపోయింది! అంటే… ఆర్టీసీ కార్మికులు వెళ్లేలోగానే టీఎన్జీవో, టీజీవో నేత‌లు ప్ర‌గ‌తి భ‌వ‌న్ కి వెళ్లిపోయారు. ఎందుకుంటే, ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి ఫోన్ రావ‌డంతోనే వెంట‌నే వెళ్లామ‌ని నేత‌లు అంటున్నారు. నిజానికి, ముఖ్య‌మంత్రి అపాయింట్మెంట్ కోసం దాదాపు ఏడాదిన్న‌ర‌గా ఇదే టీఎన్జీవో, టీజీవో, నాలుగో త‌ర‌గ‌తి ఉద్యోగ సంఘాల నేత‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నా సీఎంవో ప‌ట్టించుకోలే! ఇప్పుడు హుటాహుటిన సీఎం ఆఫీస్ నుంచి ఆహ్వానం రావ‌డం విశేషం. దీంతో ఆర్టీసీ జేయేసీ నేత‌ల‌తో స‌మావేశం జ‌ర‌గ‌కుండా పోయింది.

ఇవాళ్ల టీఎన్జీవో, ఆర్టీసీ సంఘాల నేత‌ల మ‌ధ్య భేటీ ఉంటుంద‌ని స‌మాచారం. అయితే, ముందుగా ముఖ్య‌మంత్రి మ‌న‌ల్ని పి‌లిచేశారు కాబట్టి… ఆర్టీసీ స‌మ్మెకు అనుకూలంగా ఈ ఉద్యోగ సంఘాలు మ‌ద్ద‌తు ఇస్తాయా లేదా అనేదే అనుమానం! అయితే, సీఎం కేవ‌లం మూడు సంఘాల‌నే పిల‌వ‌డంపై ఇత‌ర సంఘాల నేత‌ల్లో అసంతృప్తి వ్య‌క్త‌మౌతున్న ప‌రిస్థితీ ఉంది. మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ త‌న స‌న్నిహితుల్ని మాత్ర‌మే పిలుచుకెళ్లార‌నీ, త‌మ‌ని ప‌ట్టించుకోలేద‌ని కూడా ఇత‌ర సంఘాల నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాబ‌ట్టి, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల‌కు ఇత‌ర సంఘాల నుంచి మ‌ద్ద‌తు ల‌భించే అవ‌కాశం పూర్తిగా లేద‌నీ చెప్ప‌లేం.

ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో ప‌ద‌వులు అనుభ‌విస్తున్న కొంత‌మంది నాయ‌కులు ఉద్యోగ సంఘాల నుంచే వ‌చ్చిన‌వారు క‌దా! కానీ, ఇప్పుడు వారు నోరెత్తే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. కార్మికుల ప‌క్ష‌పాతుల‌మ‌ని గ‌తంలో చెప్పుకుని, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల స‌మ‌స్య ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి, ఏ వ‌ర్గం నుంచి వ‌చ్చారో ఆ వ‌ర్గం ప్ర‌జ‌లు రోడ్డు మీద ఉంటే వారిని ప‌ట్టించుకోకుండా… ప్ర‌భుత్వానికి అనుకూలంగా మౌనంగా ఉంటే మ‌రిన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటారు. ముందుగా ముఖ్య‌మంత్రి పిలిచేశారు కాదా, ఆయ‌న‌కే అనుకూలంగా ఉండాల‌నే ధోర‌ణిలో వీరు వ్య‌వ‌హ‌రిస్తే… గ‌తంలో వీరు చేసిన పోరాటాల‌న్నీ రాజ‌కీయ ప‌ద‌వుల కోస‌మేనా అనే అప‌వాదు కూడా మూట‌గ‌ట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close