పాక్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. భారత్ ను దారుణంగా దెబ్బకొట్టాలని ఎంత ప్రయత్నించినా వశం కాకపోవడంతో పాకిస్తాన్ సైన్యానికి ఎటు తోచడం లేదు. భారత్ మాత్రం పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొడుతూ..ఎంచుకున్న టార్గెట్ లను ఈజీగా రీచ్ అవుతోంది. ఇది పాక్ సైన్యం, ప్రభుత్వంలో ఫ్రస్టేషన్ కు ప్రధాన కారణం అవుతోంది. ఈ క్రమంలోనే పాక్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం కానుంది.భారత్ పై అణ్వాయుధాలను ప్రయోగించే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
పాక్ ప్రస్తుత పరిస్థితుల్లో అణ్వాయుధాలను ప్రయోగిస్తుందా? అంటే ఆ దేశం వైఖరి అనాలోచితంగా ఉంటుంది. పాక్ చేస్తున్న దాడులను వరుసగా తిప్పికొడుతూ భారత్ పైచేయి సాధించడం దాయాది దేశానికి ఏమాత్రం రుచించడం లేదు. భారత్ వరుసగా దెబ్బకోడుతుంటే పాక్ మాత్రం చేష్టలూడిగి కూర్చొంది అంటూ పాక్ సైన్యంపై అసహనం వ్యక్తం అవుతోంది. భారత్ తో నేరుగా తలపడేంత సీన్ పాక్ కు లేకపోయినా సైన్యాన్ని, ప్రభుత్వాన్ని కొంతమంది రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలోనే పాక్ అణ్వాయుధాలను ప్రయోగించే అంశాన్ని చర్చిస్తుందని అంటున్నారు. కానీ, అణ్వాయుధాల ప్రయోగానికి పాక్ సిద్దపడడమంటే ఆ దేశానికి తలకొరివి పెట్టుకోవడమే.
ప్రస్తుతం భారత్ తోపాటు పాక్ వద్ద వందలోపు అణుబాంబులు ఉన్నాయి. ఒకవేళ అణుయుద్దమంటూ జరిగితే మొదటి దశలోనే దాదాపు 2కోట్లమంది ప్రాణాలు కోల్పోతారు. చాలామంది రేడియేషన్ ప్రభావానికి లోనవుతారు. లక్షలాది మంది అణుబాంబు ధాటికి కాలిపోతారు. ముఖ్యంగా భూమికి రక్షణకవచంగా నిలిచే ఓజోన్ పోర దెబ్బతింటుంది. నల్లని పొగ ఆకాశాన్ని కమ్మడంతో సూర్యరశ్మి భూమిని చేరదు దాంతో చలి విపరీతంగా పెరుగుతోంది. ఆహరం కోసం అల్లాడిపోయే పరిస్థితి వస్తుంది.
హిరోషిమాలో అణు బాంబు దాడి జరిగి 74 సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ అక్కడ పుట్టే పిల్లల్లో రేడియేషన్ ప్రభావం కనిపిస్తూనే ఉంది.ఇక, భారత్ వద్ద అంతకంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న అణుబాంబులు ఉన్నాయి. పాక్ వద్ద కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి, రెండు వాడినా ఆ భీభత్సం ఊహించలేనిది గా ఉంటుంది. అణుయుద్ధం జరిగితే లక్షలాది మంది క్షణాల్లో బూడిద అవ్వడం ఖాయం.
100 కిలోమీటర్ల వరకు ఇళ్ల అద్దాలు పగిలిపోతాయి. జీవం అంతరించిపోయే పరిస్థితి రావచ్చు. ఇది ఈ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదు. అమెరికా వంటి దూర ప్రాంతాలలో కూడా పంటలు పండవు . ప్రపంచవ్యాప్తంగా ఆహారం కోసం అలజడి రేగుతోంది.భారత్ బాధ్యతాయుతమైన దేశం. అందువలన మొదటగా అణ్వాయుధాలు వాడే ఆలోచన భారత్ ఎట్టిపరిస్థితుల్లో చేయదు. కానీ, అనాలోచితంగా వ్యవహరించే పాకిస్తాన్ను మనం ఎలా నమ్మగలం?