టీడీపీదే తప్పంటే పోలవరం పూర్తవుతుందా..?

పోలవరం సందిగ్ధంలో పడింది. బాధ్యత నుంచి తప్పుకోవడానికి కేంద్రం చేయాలనుకున్నదంతా చేస్తోంది. ఇప్పటి వరకూ ఇచ్చింది చాలు.. ఇక ఇచ్చేది లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఏపీ ప్రభుత్వ నిరస్సహాయతను ఆసరాగా చేసుకుని ఆటాడుకుంటోంది. ఇలాంటి సమయంలో.. సమయోచితంగా వ్యవహరించి.. పోలవరాన్ని కాపాడుకుని.. రాష్ట్రభవిష్యత్‌ను నిర్మించాల్సిన ప్రభుత్వం రాజకీయ ఆటకే మొగ్గు చూపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం వల్లే ఇప్పుడు కేంద్రం ఇలా నిధులు తగ్గించి ఇస్తుందని చెప్పడానికే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలోనే రూ. 52వేల కోట్ల ప్రతిపాదనలకు పోలవరం టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది.

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయం స్పష్టంగా చెప్పింది. జగన్‌కు చెందిన మీడియా.. ఆ విషయాన్ని తమ ఘనతగానే చెప్పుకుని.. భారీగా ప్రచారం చేసుకుంది కూడా. మరి ఇప్పుడు.. రూ. 20వేల కోట్లే ఇస్తామని కేంద్రం ఓ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తూంటే.. ఇదేంటని అడగకుండా.. టీడీపీ చేసిన తప్పు వల్లే అని ఎదురుదాడికి దిగితే పోలవరం పూర్తవుతుందా..?. పోలవరం పూర్తయినా లేకపోయినా… టీడీపీ మీద ఎదురుదాడి చేస్తే చాలన్నట్లుగా ఏపీ సర్కార్ తీరు ఉంది. బుగ్గన ఢిల్లీకి వెళ్లిన తర్వాత కేంద్ర ఆర్థికశాఖ నుంచి నోట్ విడుదలయింది. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ. 2200కోట్లు విడుదల చేస్తున్నట్లుగా అందులో ఉంది. కానీ రూ. 20వేల కోట్ల ప్రతిపాదనకు అంగీకరిస్తేనే ఆ నిధులు విడుదల చేయాలని షరతు పెట్టారు. మామూలుగా అయితే.. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం భగ్గుమనాల్సిన పరిస్థితి.

కానీ సమీక్ష పెట్టిన సీఎం జగన్… మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులకు లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారు. వారెవరికీ తెలియకుండానే.. ఆర్థిక మంత్రి మాత్రమే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కానీ వారెవర్నీ నిలదీసే పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం లేదు. అందుకే లేఖలతో సరి పెడుతుంది. అంటే.. ఇక పోలవరం ముందుకెళ్లదు.. కానీ దాని కేంద్రంగా… బురద రాజకీయం మాత్రం ప్రారంభం కాబోతోంది. పోలవరం పూర్తవుతుందని ఆశ పెట్టుకున్న వారికి షాక్ తగలబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ద‌ర్శ‌కేంద్రుడితో… స‌మంత‌, శ్రియ‌, ర‌మ్య‌కృష్ణ‌

కె.రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. ఓ నటుడిగా ఆయ‌న త‌న‌లోని కొత్త కోణాన్నిచూపించ‌బోతున్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కె.రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌ధారి. ఈ చిత్రంలో ముగ్గురు క‌థానాయిక‌లు...

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

HOT NEWS

[X] Close
[X] Close