ఆర్కే పలుకు : తప్పు జగన్‌ది కాదు..అధికారులది..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనుకడుగు వేస్తున్నారా..? కొన్ని నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూండటంతో …ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నారా..?. ఇప్పటి వరకూ.. ఏ విషయంలోనూ ప్రజలకు, ప్రతిపక్షాలకు ఇలాంటి సూచనలు కనిపించలేదు. అధికారం చేపట్టినప్పటి నుండి తాను అనుకున్నది చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రిగా తాను కుల, మతాలకు.. ఓటు బ్యాంక్‌ రాజకీయానికి అతీతంగా వ్యవహరించాల్సిన ఆయన.. ఓట్లు వేసిన కొంత మంది ప్రజల్ని టార్గెట్‌గా చేసుకుని రాజకీయం చేస్తున్నారు. ఎప్పుడూ తన నిర్ణయాలను వెనక్కి తీసుకోలేదు. అయితే అనూహ్యంగా ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు మాత్రం… అయన ప్రజా వ్యతిరేకతను గుర్తించి నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నారని అనిపిస్తోంది.

ప్రతీ వారాంతంలో రాసే కొత్తపలుకు ఆర్టికల్‌లో ఈ సారి అదే విషయాన్ని చెప్పారు. మిగతా విషయాలు చాలా వరకు మొత్తం తాను గతంలో చెప్పినట్లుగా.. వైసీపీ, బీజేపీ రహస్య స్నేహం గురించి చెప్పినప్పటికీ.. కొత్తగా మాత్రం… జగన్ మారుతున్నారని చెప్పడానికి ప్రయత్నించారు. దానికి ఉదాహరణగా… ఏడు రోజుల పాటు నీటిలో ఉన్న వారికే ఉచిత రేషన్ ఇవ్వాలని మొదట జీవో ఇచ్చారు. తర్వాత ఉదారంగా సాగాయం చేయాలని జగన్ ఆదేశించారు. జగన్‌లో వస్తున్న మార్పునకు అదే కారణం అని ఆర్కే చెప్పాలని ప్రయత్నించారు. ప్రజా వ్యతిరేకతను గుర్తించి మారుతున్నారని చెప్పుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాల మీద మొదటి నుంచి స్పందిస్తున్నారు.

అధికారం చేపట్టిన తొలి నాళ్లలో… విద్యార్థులకు ఇచ్చే ఓ అవార్డుకు భారత రత్న అబ్దుల్ కలాం పేరు ఉండేది. కానీ ఆపేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టారు. దీనిపై జాతీయ స్థాయిలో దుమారం రేగింది. వెంటనే జగన్.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా.. అదేపేరు కొనసాగించాలని ఆదేశించినట్లుగా ప్రెస్‌నోట్ వచ్చింది. కానీ ఆ నిర్ణయం.. జగన్ సమక్షంలోనే తీసుకున్నారని అధికారవర్గాలు అప్పుడే.. ఆఫ్ ది రికార్డు చెప్పుకున్నాయి. ఇలాంటి నిర్ణయాలను ఆయన వెనక్కి తీసుకుంటున్నారు.. దాని ప్రజా వ్యతిరేకత కారణం కాదు. మరీ సిల్లీగా ఉంటున్న వాటి విషయంలో మాత్రమే వెనక్కి తగ్గుతున్నారు. ప్రజా వ్యతిరేకత గురించి ఆలోచించే పరిస్థితుల్లో జగన్ లేరని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఆయనలో ఆ భయమే ఉంటే.. ఇన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకోరు. అదే సమయంలో…. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి తప్పేమీ లేదన్నట్లుగా చెప్పడానికి ఆర్కే ప్రయత్నించినట్లుగా ఆర్టికల్‌లో స్పష్టమవుతోంది.

పాలనపై జగన్‌కు పట్టు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది అధికారులే ఆ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారట. సీఎంకు తెలియకుండానే టీటీడీ నిధులు.. ఏపీ సెక్యూరిటీల్లోకి పెట్టాలని నిర్ణయాన్ని అధికారుల చొరవతో టీటీడీ తీసుకుందని ఆర్కే చెబుతున్నారు. మొత్తం మీద.. గతంలోలా.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకొచ్చినా.. ఆర్టికల్‌లో కొన్ని చోట్ల.. జగన్ తప్పేమీ లేదని చెప్పడానికి ఆర్కే ప్రయత్నించడం.. మాత్రం కొంచెం కొత్తగానే ఉంది. ఎందుకంటే తాడేపల్లి అంతంపురం ఆదేశాలు లేనిదే.. ఏపీలో చీమైనా కదలదని.. తెలియని రాజకీయ జర్నలిస్టు లేడు మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close